Unstoppable With NBK 2: ఇంట్లో తనే అన్‌స్టాపబుల్‌.. నా మనవళ్లు నన్ను తాత అనరు.. బాలయ్య ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

|

Oct 05, 2022 | 8:00 AM

ఇప్పుడీ ఫన్‌ను మరింత పెంచేందుకు అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే రెండో సీజన్‌ను ఆడియెన్స్‌ ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా రెండో సీజన్‌కి సంబంధించి విజయవాడలో ప్రి లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించారు.

Unstoppable With NBK 2: ఇంట్లో తనే అన్‌స్టాపబుల్‌.. నా మనవళ్లు నన్ను తాత అనరు.. బాలయ్య ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
Nandamuri Balakrishna
Follow us on

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే ఛాట్‌ షో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్నిటికీ మించి ఈ టాక్‌షో కు హోస్ట్‌గా వ్యవహరించిన బాలకృష్ణ సెన్సాఫ్‌ హ్యూమర్‌, పలు సెలబ్రిటీలతో ఆయన పంచుకున్న కబుర్లు ఈ షోను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఇప్పుడీ ఫన్‌ను మరింత పెంచేందుకు అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే రెండో సీజన్‌ను ఆడియెన్స్‌ ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా రెండో సీజన్‌కి సంబంధించి విజయవాడలో ప్రి లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించారు. కాగా ఈ ఈవెంట్‌లో బాలయ్య బాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. అవి కాస్తా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ఈసారి చిరు, వెంకీ, నాగ్‌..

ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యుల గురించి చెప్పిన బాలకృష్ణ ‘బయట నేను ఎంత అన్‌స్టాపబుల్‌ అయినా ఇంట్లో మాత్రం నా సతీమణి వసుంధరే అన్‌స్టాపబుల్‌. ఆమె నన్ను భరిస్తోంది. నా కుటుంబాన్ని లీడ్ చేస్తోంది. సినిమాలు, ఆస్పత్రి విషయాల్లో నేను బిజీగా ఉంటే మిగతా విషయాలు తనే చూసుకుంటుంది. అందుకే ఇంట్లో ఆమె అన్‌స్టాపబుల్’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సీజన్‌లో వచ్చే గెస్టులపై స్పందిస్తూ ‘ ఈసారి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ వచ్చే ఛాన్స్‌ ఉందన్నారు. వాళ్ల సమయాన్ని బట్టి వస్తారు. కచ్చితంగా మొదటి సీజన్‌ కంటే రెండో సీజన్‌ భారీ విజయాన్ని అందుకుంటుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు’ అని తెలిపారు బాలయ్య.

కాగా చివరిగా యాంకర్ .. ‘మిమ్మల్ని నేను మావయ్యా అని పిలవచ్చా?’ అని అడగ్గా.. ‘మా ఇంట్లో నా మనవళ్లతోనే నేను తాతయ్య అని పిలిపించుకోను. బాలా అని పిలుస్తారు’ అని సరదాగా సమాధానం ఇచ్చారు బాలయ్య.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..