అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న యువ సామ్రాట్ నాగ చైతన్య మొదటి వెబ్ సిరీస్ ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పటికే ఆలస్యమైందనుకున్నారేమో అనుకున్న టైమ్ కంటే కాస్త ముందుగానే స్ట్రీమింగ్ కు వచ్చేసింది. శుక్రవారం డిసెంబర్ 1న దూత స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా గురువారం (నవంబర్ 30) సాయంత్రం 8 గంటల నుంచే చైతూ వెబ్ సిరీస్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. నాగచైతన్యతో మనం, థ్యాంక్యూ లాంటి సినిమాలను తెరకెక్కించిన కె. విక్రమ్ కుమార్ దూత వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. చైతూతో పాటు ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూత వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
దూత సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారు 40 నిమిషాల నిడివితో ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ దూత వెబ్ సిరీస్‌పై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా నాగ చైతన్య ఇంటెన్స్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. దీనికి తోడు ప్రస్తుతం ఓటీటీలో హార్రర్, థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లకు మంచి ఆదరణ దక్కుతోంది. కాబట్టి ఓటీటీ ప్రియులకు దూత కూడా మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. ప్రముఖ నిర్మాత శరద్ మరార్‌తో కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ దూత వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఇషాన్ చబ్రా సంగీతం అందించారు. కాగా దూత వెబ్ సిరీస్ కోసం భారీ బడ్జెట్ వెచ్చించినట్లు తెలుస్తోంది. నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధికంగా రూ. 45 కోట్లకు పైగానే ఈ సిరీస్ కోసం ఖర్చు చేశారని సమాచారం.
an endless search, countless clues, one answer🤫#DhoothaOnPrime, watch nowhttps://t.co/6KygrFJZyn@chay_akkineni @parvatweets @priya_Bshankar @ItsPrachiDesai @Vikram_K_Kumar @nseplofficial @sharrath_marar @NambuShalini #NeelimaSMarar #MikolajSygula @NavinNooli #Rajeevan… pic.twitter.com/noXUSOHyhu
— prime video IN (@PrimeVideoIN) November 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.