OTT Movie: 2.5 కోట్లతో తీస్తే 40 కోట్లకు పైగా కలెకన్లు.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ

దసరా పండగను పురస్కరించుకుని ఈ వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో ఒక బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉంది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించి ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది.

OTT Movie: 2.5 కోట్లతో తీస్తే 40 కోట్లకు పైగా కలెకన్లు.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ
OTT Movie

Updated on: Sep 30, 2025 | 2:10 PM

దసరా పండగను పురస్కరించుకుని ఈ వారం కాస్త ముందుగానే ఓటీటీలోకి సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగు సినిమాలతో పాటు వివిధ భాషలకు చెందిన మూవీస్ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. అలా ఇటీవల థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిన ఒక సినిమా మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మూవీలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేరు.. పెద్ద పెద్ద ఎలివేషన్స్ లేవు.. యాక్షన్ సీక్వెన్సులు, స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా ఏమీ లేవు. విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. అయినా కంటెంట్ తో రికార్డు కలెక్షన్లు సాధించిందీ సినిమా. కేవలం రూ. 2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ.40 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా యువతకు ఈ సినిమా తెగ నచ్చేసింది. కడుపుబ్బా నవ్వించే కామెడీ ఉండడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ మూవీని ఎగబడి చూశారు. విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అడివి శేష్, బండ్ల గణేశ్ తదితర స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు కూడా లిటిల్ హార్ట్స్ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు.

థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీని ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరికాసేపట్లో వీరి నిరీక్షణకు తెరపడనుంది. బుధవారం (అక్టోబర్ 01) నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించింది ఓటీటీ సంస్థ. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఓటీటీలోకి రానుందన్నమాట.

ఇవి కూడా చదవండి

ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? మౌళి తనూజ్ హీరోగా నటించిన లిటిల్ హార్ట్స్. ఈ ఏడాది భారీ విజయం సాధించిన సినిమాల్లో ఒకటైన ఈ మూవీ ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ లో శివానీ నాగారం హీరోయిన్ గా నటించింది. రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, సత్య కృష్ణన్, జయకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

 ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఈటీవీ విన్ లో లిటిల్ హార్ట్స్ సినిమా

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి