Most Eligible Bachelor: ఓటీటీలో సందడి చేయనున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ఆహాలో స్ట్రీమింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..
Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఈ సినిమాలో అందాల తార పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇక ఇటు దర్శకుడు భాస్కర్‌తో పాటు,..
Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాలో అందాల తార పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇక ఇటు దర్శకుడు భాస్కర్‌తో పాటు, అటు హీరో అఖిల్‌కు విజయం ఎంతో అవసరమైన సందర్భంలో వచ్చిన చిత్రం వారి ఆశలను సజీవంగా ఉంచాయి. రొమాంటిక్ లవ్‌స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే కరోనా పరిస్థితులను సైతం తట్టుకొని ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. దీంతో సినిమా లాభాలతోనే బిజినెస్ ముగిసింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. గీతాఆర్ట్స్-2 బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు ఆహా యాజమాన్యం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాన్ని నవంబర్ 19న ఆహాలో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ఆహాతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా విడుదల చేస్తుండడం విశేషం. మరి బిగ్ స్క్రీన్‌పై వండర్స్ క్రియేట్ చేసి అఖిల్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమా డిజిటల్ స్క్రీన్‌పై ఎలాంటి అద్భుతం సృష్టిస్తుందో చూడాలి.
Akhil Akkineni – Pooja Hedge’s #MostEligibileBachelor will premiere on AHA and NETFLIX on November 19th. pic.twitter.com/8gUND71Hji
— Christopher Kanagaraj (@Chrissuccess) November 14, 2021
580 సంవత్సరాల తర్వాత కనిపించే సుదీర్ఘమైన చంద్రగ్రహణం.. ఎప్పుడు.. ఎక్కడ కనిపిస్తుందో తెలుసుకోండి..