Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Insurance: కారు ఇన్సూరెన్స్.. కచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే.. లేకపోతే నష్ట పోవడం ఖాయం!

ఇటీవల ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. బీమా కంపెనీ అతని క్లెయిమ్‌ను తిరస్కరించింది. వాహనాలు బీమా చేయించేటపుడు దాని నియమాలు తెలుసుకోకుండా పాలసీ తీసుకుంటే ఇటువంటి పరిస్థితి వస్తుంది.

Car Insurance: కారు ఇన్సూరెన్స్.. కచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే.. లేకపోతే నష్ట పోవడం ఖాయం!
Car Insurance
Follow us
KVD Varma

|

Updated on: Nov 14, 2021 | 1:29 PM

Car Insurance: ఇటీవల ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. బీమా కంపెనీ అతని క్లెయిమ్‌ను తిరస్కరించింది. ఎందుకంటే అది 346 సీసీ బైక్. సహజంగానే, పాలసీ నిబంధనలు.. షరతుల ప్రకారం, బైక్ సామర్థ్యం 150 సీసీ కంటే ఎక్కువ ఉంటే, కంపెనీ చెల్లించాల్సిన బాధ్యత లేదు. ఇలా ఎందుకు జరిగి ఉండొచ్చు అంటే.. పాలసీ చేసినపుడు బైక్ సామర్ధ్యాన్ని తప్పుగా ఇచ్చి ఉండవచ్చు. లేదా బీమా కంపెనీ పాలసీ గురించి వినియోగదారునికి సరైన సమాచారం తెలియకపోయి ఉండవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీలో చాలా నిబంధనలు ఉంటాయి. సాధారణంగా వినియోగదారులు అవన్నీ సరిగ్గా చదవరు. సరిగ్గా ఏమిటి ఇంకా చెప్పాలంటే అసలు చదవరు. ఇది వాస్తవం. దీంతో చిన్న చిన్న పొరపాట్లతో బీమా ప్రయోజనాన్ని కోల్పోవడం జరుగుతుంది. వాహనాలను బీమా చేసిన కంపెనీ మీ క్లెయిమ్ తిరస్కరించడం లేదా పూర్తిగా చెల్లించకపోవడం జరగడానికి అవకాశం ఉండే కొన్ని ముఖ్యమైన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

యాడ్ ఆన్ కవర్..

క్లెయిమ్‌లు తిరస్కరణకు గురికావడానికి ఒక సాధారణ కారణం ఏమిటంటే, కొన్ని అంశాలు డ్యామేజ్ పాలసీ కింద కవర్ కావు. వీటికి ప్రత్యేక యాడ్-ఆన్ కవర్‌ను కొనుగోలు చేయడం అవసరం. ఉదాహరణకు, ఇంజిన్ వైఫల్యం లేదా తరుగుదల నష్టం ప్రాథమిక పాలసీలో కవర్ కాదు. దీని కోసం మీకు ప్రత్యేక ఇంజిన్ ప్రొటెక్టర్ అలాగే జీరో డిప్రిసియేషన్ యాడ్-ఆన్ కవర్ తీసుకోవడం అవసరం.

మరమ్మత్తు కోసం పంపిన కారు..

మరో సాధారణ తప్పు ఏమిటంటే, కారుని మీరే రిపేర్ చేయించడం. అంటే కారుకి ఏదైనా డేమేజి జరిగితే వెంటనే మీరు చిన్న చిన్న రిపేర్లు చేయించి.. తరువాత బీమా కంపెనీకి సమాచారం అందించడం. దీని వలన ప్రమాదాన్ని గుర్తించడం.. దానిని మరమ్మత్తు చేయడం కంపెనీకి కష్టంగా మారుతుంది. కాబట్టి ఇది పొరపాటు. ఇది నష్టాలను అంచనా వేయడం, మీ క్లెయిమ్ ను ఆమోదించడం మరింత కష్టతరం చేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో మీ వాహనానికి డేమేజి జైరిగితే వెంటనే బీమా కంపెనీని సంప్రదించండి. వారు నష్టాన్ని సరిగ్గా అంచనా వేయడమే కాకుండా రోడ్‌సైడ్ సహాయాన్ని అందించి, కారును మీ గ్యారేజీకి చేరుస్తారు.

వాహనం వాణిజ్య వినియోగం

మీరు వ్యక్తిగత ఉపయోగం కోసం ఒక కారు కొనుగోలు చేశారు. కానీ, దానిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ఆ సందర్భంలో కారుకు ఏదైనా డేమేజీ జరిగితే మీ క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది.

సరైన సమాచారాన్ని ఇవ్వకపోవడం..

పాలసీని కొనుగోలు చేసే సమయంలో తప్పుడు సమాచారం ఇవ్వాడం లేదా నో-క్లెయిమ్ బోనస్ లేదా మునుపటి నష్టాలు వంటి వాటిని బహిర్గతం చేయకుంటే, క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా, ఎవరైనా క్లెయిమ్ ఫైల్ చేస్తున్నప్పుడు ప్రమాదం లేదా నష్టం గురించి తప్పుడు సమాచారం అందించినట్లయితే, ఆప్పుడు కూడా క్లెయిమ్ పరిష్కారం కాదు.

బదిలీలో లోపం

వాహన యజమాని తన పేరు మీద రిజిస్ట్రేషన్, బీమాను బదిలీ చేయడం విషయంలో ఏదైనా సమస్య ఏర్పడితే..అటువంటి సందర్భంలో బీమా క్లెయిమ్ పరిగణన లోకి కంపెనీ తీసుకోదు.

అదనపు హంగులు ఏర్పాటు..

మీ వాహనంలో మీరు సీఎన్జీ (CNG) కిట్‌ను ఇన్‌స్టాల్ చేసినా, ఇతర ఉపకరణాలను జోడించినా లేదా మీ కారు బాడీలో మార్పులు చేసినా, మీరు వెంటనే బీమా కంపెనీకి తెలియజేయాలి. లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు మీ క్లెయిమ్ ను బీమా కంపెనీ అంగీకరించదు.

పాలసీ మార్గదర్శకాలు

మీరు మీ పాలసీలోని క్లాజుల పరిమితులకు అనుగుణంగా వాహనాన్ని ఉపయోగించకాపోతే మీ క్లెయిమ్ తిరస్కరించవచ్చు. అంటే, మీరు నిర్దిష్ట భౌగోళిక పరిమితుల్లో డ్రైవింగ్ చేయనట్లయితే లేదా వాహనం నిర్దిష్ట ఇంజిన్ సామర్థ్యం వంటి పాలసీలో పేర్కొన్న స్పెసిఫికేషన్‌లను కలిగి లేకుంటే మీ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్..

ప్రమాదం జరిగినప్పుడు వాహనం నడుపుతున్న వ్యక్తి తన లైసెన్స్‌ని కలిగి ఉండకపోతే క్లెయిమ్ తిరస్కరిస్తారు. అంతేకాకుండా డ్రైవర్ గడువు ముగియని చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌ని కలిగి ఉండాలి. లైసెన్స్ జారీ చేసిన వాహనం.. ప్రమాదానికి గురయిన వాహనం రకం ఒకేలా ఉండాలి. ఉదాహరణకు, అతను ద్విచక్ర వాహనం మాత్రమే నడపడానికి లైసెన్స్ కలిగి ఉండి, కారు నడుపుతున్నప్పుడు ప్రమాదం జరిగితే, క్లెయిమ్ తిరస్కరిస్తారు. అంటే, సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వాహనానికి జరిగిన ప్రమాదానికి బీమా లభించదు.

డ్రంక్ అండ్ డ్రైవింగ్

మద్యం తాగి వాహనం నడపడం క్లెయిమ్ తిరస్కరణకు మరొక స్పష్టమైన కారణం. భారతదేశంలో మద్యం సేవించి వాహనం నడపడం చట్టవిరుద్ధం కాబట్టి, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల సంభవించే ఏదైనా క్లెయిమ్ తిరస్కరణకు గురి అవుతుంది.

సమయం..

మీరు ప్రమాదం గురించి బీమా కంపెనీకి వెంటనే తెలియజేయకపోతే, మీ క్లెయిమ్ తిరస్కరించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని కోసం మీరు సాధారణంగా 24-48 గంటలలోపు సమయంలో ప్రమాదం గురించి బీమా కంపెనీకి తెలియజేయాలి.

పాలసీ పునరుద్ధరణలో జాప్యం

మీరు పాలసీని పునరుద్ధరించడం మరచిపోయినట్లయితే క్లెయిమ్ పరిష్కారం కాదు. ఈ సమయంలో ప్రమాదం సంభవించినట్లయితే, బీమా కంపెనీ క్లెయిమ్‌ను స్వీకరించదు.

తరుగుదల కారణంగా నష్టం

వర్షాకాలంలో హైడ్రోస్టాటిక్ నష్టాల కారణంగా ఇంజిన్ దెబ్బతినడం సాధారణం. ఇక్కడ నష్టం వరదలు లేదా వర్షాల వల్ల కాదు. కానీ, ఎవరైనా నీటమునిగే ప్రదేశంలో కారును నడిపి.. అప్పుడు కారు ఇంజన్ డేమేజీ అయితే సహజంగానే ఇది బీమా కంపెనీ పరిధిలోకి రాదు.

మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ బ్రేక్‌డౌన్

మోటార్ బీమా పాలసీలు ఎలాంటి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ సమస్యను కవర్ చేయవు. ఇంజిన్ ఆయిల్ లేదా లూబ్రికెంట్ వంటి వస్తువులు ప్రాథమిక పాలసీ పరిధిలోకి రావు. అలాగే ప్లాస్టిక్ భాగాలు లేదా టైర్లు కూడా ఉండవు.

మారుతున్న కీలు లేదా లాక్స్

కార్లు ఈ రోజుల్లో సాంకేతికంగా అధునాతన కీలు, కీలెస్ లాకింగ్ సిస్టమ్‌లతో వస్తున్నాయి. ఇవి పాడితే తిరిగి అమర్చుకోవడం చాలా ఖరీదైనదిగా ఉంటుంది. అటువంటపుడు వీటిని బీమా పరిధిలో క్లెయిమ్ చేయలేరు. దీనికోసం ప్రత్యేకమైన యాడ్-ఆన్ కవర్ కలిగి ఉండాలి. అప్పుడు వీటి డేమేజికి ఇన్సూరెన్స్ వస్తుంది.

ఇవి కూడా చదవండి: Crypto Currency: అక్రమ క్రిప్టో ఎక్స్ఛేంజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి..అధికారులను కోరిన ప్రధాని మోడీ

Amit Shah: అమిత్ షా ఆంధ్రా పర్యటన.. మూడురోజుల పాటు బిజీ బిజీగా గడపనున్న కేంద్ర హోం మంత్రి!

Sharia Law: కఠినమైన షరియా చట్టం అమలుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధం.. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తాలిబన్ ప్రభుత్వం!