Mirzapur 3: వైరలవుతోన్న మీర్జాపూర్ 3 నటీనటుల రెమ్యునరేషన్.. ఎక్కువగా ఎవరికీ ఇచ్చారో తెలుసా?

|

Jul 07, 2024 | 9:17 AM

'మీర్జాపూర్ సీజన్ 3' అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 5న విడుదలైంది. 'మీర్జాపూర్' మొదటి రెండు సీజన్‌లను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇప్పుడు ఈ సిరీస్‌లోని మూడో సీజన్‌కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది

Mirzapur 3: వైరలవుతోన్న మీర్జాపూర్ 3 నటీనటుల రెమ్యునరేషన్.. ఎక్కువగా ఎవరికీ ఇచ్చారో తెలుసా?
Mirzapur Season 3
Follow us on

‘మీర్జాపూర్ సీజన్ 3’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 5న విడుదలైంది. ‘మీర్జాపూర్’ మొదటి రెండు సీజన్‌లను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇప్పుడు ఈ సిరీస్‌లోని మూడో సీజన్‌కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు కాలీన్ భయ్యా అంటూ పొగుడుతుంటే, మరికొందరు మున్నా భయ్యాను చాలా మిస్ అవుతున్నామంటున్నారు. మున్నా భయ్యా లేనందున చాలా మందికి ఈ సిరీస్ నచ్చడంలేదు. కాగా ‘మీర్జాపూర్ సీజన్ 2’ ముగింపులో మున్నా పాత్ర ముగిసిపోయింది. మూడవ సీజన్ ప్రారంభంలో కూడా మున్నా మరణించినట్లు చూపించారు. ఇదే అప్పుడు మీర్జాపూర్ అభిమానులను కలిచివేస్తోంది. మూడో సీజన్‌లో కాలీన్ భయ్యా కేవలం షోపీస్‌గా మారిపోయారని ఈ సిరీస్ చూసిన ప్రేక్షకులు అంటున్నారు. కాగా మీర్జాపూర్ 3 నటీనటుల రెమ్యునరేషన్ కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.

ఈ సిరీస్‌లో బీనా త్రిపాఠి పాత్రకు నటి రసిక దుగ్గల్ న్యాయం చేసింది. ఈ సిరీస్‌లోని ఒక్కో ఎపిసోడ్‌కు నటికి రూ.2 లక్షలు తీసుకుందామె. అంటే 10 ఎపిసోడ్లకు గాను ఈ నటి 20 లక్షల రెమ్యునరేషన్ అందుకుంది. ఇక మూడో సీజన్ లో హైలెట్ గా నిలిచిన గుడ్డు పండిట్ పాత్రలో కనిపించిన నటుడు అలీ ఫజల్ ఒక్కో ఎపిసోడ్‌కు 12 లక్షలు అందుకున్నాడు. అంటే 10 ఎపిసోడ్లకు గాను రూ.1.20 కోట్లు తీసుకున్నాడు. నటుడు జితేంద్ర కుమార్ ఈ సిరీస్‌లో అతిథి నటుడిగా కనిపించారు. ‘పంచాయతీ 2’లో ఒక ఎపిసోడ్ కోసం నటుడు రూ.4 లక్షలు తీసుకున్న అతను మీర్జాపూర్ మూడవ సీజన్ కోసం భారీగానే రెమ్యునరేషన్ పెంచేశాడు.

ఇవి కూడా చదవండి

ఇక మీడియా కథనాల ప్రకారం, నటుడు పంకజ్ త్రిపాఠి మీర్జాపుర్ సిరీస్ కోసం 2 నుంచి 10 కోట్లు అందుకున్నారు. మూడో సీజన్ కోసం ఆయన కూడా పారితోషకం పెంచినట్లు సమాచారం. అయితే పంకజ్‌కి ఎంత మొత్తం వచ్చింది అనే సమాచారం మాత్రం బయటకు రాలేదు. ఇక నటి శ్వేతా త్రిపాఠికి ఒక్కో ఎపిసోడ్‌కు 2.20 లక్షలు చెల్లిస్తున్నారు. అంటే 10 ఎపిసోడ్లకు గాను శ్వేత 22 లక్షల రూపాయలు అందుకుందన్న మాట.

జులై 5 నుంచి స్ట్రీమింగ్..

మీర్జాపూర్ సీజన్ 3 టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.