OTT Movie: అమ్మాయిలకు మత్తుమందిచ్చి.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 8.8 రేటింగ్

గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి మంచి రెస్పాన్నే వచ్చింది. ఆసక్తికరమైన కథా కథనాలు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అద్దరిపోయే ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 8.8/10 రేటింగ్ దక్కడం విశేషం.

OTT Movie: అమ్మాయిలకు మత్తుమందిచ్చి.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 8.8 రేటింగ్
Karmanye Vadhikaraste Movie IN OTT

Updated on: Nov 21, 2025 | 9:40 PM

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (నవంబర్ 21) పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు కూడా వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. ఇందులో ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా కూడా ఉంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఐఎండీబీలో ఏకంగా 8.8/10 రేటింగ్ పొందింది. థియేటర్లలో మరీ గొప్పగా ఆడనప్పటికీ ఓ మోస్తరు రెస్పాన్స్ అయితే అందుకుంది. ముఖ్యంగా సినిమాలోని ట్విస్టులు అద్దిరిపోయాయని ప్రశంసలు వచ్చాయి.ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రియల్ లైఫ్ స్టూడెంట్ కిడ్నాపింగ్స్, మర్డర్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. హైదరాబాద్‌లో పృథ్వి అనే వ్యక్తి ఒక రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. అయితే ఈ ఘటనపై అనుమానాలు తలెత్తడంతో ఏసీపీ అర్జున్ కేసు తీసుకుని వచారించడం మొదలు పెడతాడు. ఆ యాక్సిడెంట్‌లో కొన్ని క్లూస్ దొరుకుతాయి. మృతుడిది ఫేక్ అడ్రస్ అని తేలుతుంది. విచారణ ముందుకు సాగే కొద్దీ ఇలాంటి ఫేక్ అడ్రస్ లో ఉన్నవాళ్లు చాలా మంది అనుమానాస్పదంగా మరణించినట్లు తెలుస్తోంది. మరో వైపు సిటీలో అమ్మాయిల వరుస హత్యలు జరుగుతుంటాయి. మత్తుమందు ఇచ్చి వాళ్లపై హత్యాచారం చేస్తుంటారు.

తీరా చూస్తే ఈ క్రైమ్స్ వెనక ఓ భయంకరమైన నెట్ వర్క్ ఉందని పోలీసులు తెలుసుకుంటారు? మరి ఆ నెట్ వర్క్ ఏంటి? అసలు ఆ కిల్లర్స్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను టార్గెట్ చేసి చంపుతున్నారు? వీరి నేర సామ్రాజ్యాన్ని పోలీసులు ఎలా కనిపెట్టారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ ఇన్వెస్టిగ్రేషన్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా పేరు ‘కర్మణ్యే వాధికారస్తే’. 2025 అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇందులో ఐరా దయానంద్, బ్రహ్మాజీ, శత్రు, మహేంద్రన్, పృథ్వీరాజ్, శివాజీ రాజా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఉషస్విని ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మించింది. ప్రస్తుతం ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఐరా దయానంద్, బ్రహ్మాజీ, శత్రు, మహేంద్రన్, పృథ్వీరాజ్, శివాజీ రాజా వంటి నటులు నటించారు. జ్ఞాని మ్యూజిక్ అందించగా, ఉషస్విని ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మించింది. ప్రస్తుతం ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.