
జానర్ ఏదైనా ఓటీటీలో మలయాళం సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ప్రతి వారం రెండు లేదా మూడు సినిమాలు కచ్చితంగా ఓటీటీలోకి వస్తుంటాయి. అలా రీసెంట్ గా మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే ఈ సినిమా థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. ఆసక్తికరమైన కథా కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అద్దిరిపోయే ట్విస్టులు.. ఇలా అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా కథ ఒక ఫ్యామిలీ మ్యాన్ ని హత్యతో మొదలవుతుంది. పోలీస్ స్టేషన్ లో ఈ కేసు సీఆర్ 143/24 అని రిజిస్టర్ అవుతుంది. పోలీసులు తమదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మొదట్లో ఈ మర్డర్ కేసు చాలా సింపుల్ గా అనిపిస్తుంది. అయితే ముందుకెళ్లే కొద్దీ కాంప్లికేటెడ్ గా మారుతుంది. పోలీసులు చాలా మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తారు. కానీ ఈ మర్డర్ కేసు ఏ పట్టాన ఓ కొలిక్కి రాదు. దీంతో పోలీసులు కూడా ఈ కేసును సాల్వ్ చేయలేక తలలు పట్టుకుంటారు.
డబ్బు, వివాహేతర సంబంధాలు, పగలు, ప్రతీకారాలు.. ఇలా అన్నీ కోణాల్లో ఈ కేసు విచారణ జరుగుతుంది. చివరిలో అన్ని కథలు ఒకదానితో ఒకటి కనెక్టయ్యాక ఒక సంచలన నిజం వెలుగులోకి వస్తుంది. మరి ఆ నిజం ఏమిటి? ఆ ఫ్యామిలీ మ్యాన్ ను ఎవరు హత్య చేశారు? ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.
ఆద్యంతం ఉత్కంఠ భరిత సన్నివేశాలతో సాగే ఈ సినిమా పేరు ‘థగ్ సిఆర్ 143/24′ (Thug CR 143/24). డైరెక్టర్ బాలు ఎస్ నాయర్ తెరకెక్కించిన ఈ సినిమాలో ధ్యాన్ శ్రీనివాసన్ లీడ్ రోల్‌లో నటించాడు. సిద్దీఖ్, వినయా ప్రసాద్, బిందు పానిక్కర్, సాయికుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సుమారు 1 గంట 36 నిమిషాల పాటు సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం మనోరమా మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు. ఓటీటీలో మంచి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకునేవారికి థగ్ సిఆర్ 143/24’ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .