
ఓటీటీలోకి మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా దుమ్మురేపుతోంది. ఆద్యంతం ఆసక్తికరంగా కథా కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులతో ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇస్తోంది. ఈ సినిమా ఓరిజెనల్ మలయాళ వెర్షన్ జులైలోనే స్ట్రీమింగ్ కు రాగా ఇటీవలే తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులో వచ్చింది. కేరళలోని ప్లాచిక్కావు అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. నేరాలు లేని ప్రశాంతమైన ఊరు ఇది. క్రైమ్ రేట్ చాలా తక్కువ. పోలీసులకు కూడా పెద్దగా పనుండదు. పైగా ఇదే గ్రామంలో ఒక యువకుడు డిటిక్టివ్ గా పని చేస్తుంటాడు. ఏవైనా చోరీలు జరిగినా ఇట్టే కనిపెట్టి పోలీసులకు సాయం చేస్తుంటాడు. అలాంటి ప్రశాంతమైన గ్రామంలో ఒక్కసారి అలజడి మొదలవుతుంది. గ్రామంలో వరుస హత్యలు జరుగుతాయి. పోలీసుల విచారణలో ఒక సైకో కిల్లర్ పని గట్టుకుని ఈ మర్డర్లు చేస్తున్నాడని తెలిసి గ్రామస్తులందరూ ఉలిక్కి పడతారు. పోలీసులు డిటెక్టివ్ సాయం తీసుకున్నా ఎలాంటి క్లూ దొరకదు. చివరకు ఈ మర్డర్ల మిస్టరీని చేధించేందుకు సీనియర్ పోలీసాఫీసర్లు కూడా రంగంలోకి దిగుతారు. వీరి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. గ్రామంలో వరుస హత్యలకు పాల్పడింది డిటెక్టివేనని మొదట అనుమానిస్తారు. కానీ ఆ తర్వాత తప్పు తెలుసుకుని సమన్వయంతో ఆ సైకో కిల్లర్ ను పట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తారు.
మరి మాస్కు వేసిన మనిషి ఎవరు? ఎందుకు క్రూరంగా హత్యలు చేస్తున్నాడు. అసలు ఆ సైకో కిల్లర్ మోటివ్ ఏంటి? చివరకు డిటెక్టివ్, పోలీసులు ఈ సైకో కిల్లర్ ను కనిపెట్టారా? లేదా? చివరికి ఏం జరిగింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే డిటెక్టివ్ ఉజ్వలన్ సినిమా చూడాల్సిందే. ఇంద్రనీల్ గోపీకృష్ణన్, రాహుల్ జి సంయుక్తంగా తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ధ్యాన్ శ్రీనివాసన్, సిజు విల్సన్, కొట్టయం నజీర్ తదితరులు నటించారు. ఈ మూవీకి ఐఎండీబీలో 6.2 రేటింగ్ నమోదైంది.ప్రస్తుతం ఈ సినిమా లయన్స్ గేట్ ప్లే లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు. హిందీ వెర్షన్ మాత్రం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూడాలనుకునేవారికి డిటెక్టివ్ ఉజ్వలన్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
తెలుగులోనూ స్ట్రీమింగ్..
Clues, twists, and a mystery that won’t let go.
Make it a thrilling watch — Watch #DetectiveUjjwalan streaming now on @primevideoin 🕵️♂️💫#DetectiveUjjwalan#DhyanSreenivasan @siju_wilson #Ameen #NibrazNoushad #Shahubas #RonyDavid #KottayamNazeer #SeemaGNair #NirmalPalazhi… pic.twitter.com/QXxg8l5wIz— AP International (@APIfilms) September 28, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.