AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మొన్ననే థియేటర్లలో రిలీజ్.. అప్పుడే ఓటీటీలోకి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజులు లేదా ఐదు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి సినిమాలు. కొన్ని చిత్రాలైతే మూడు వారలకే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అయితే ఈ తెలుగు సినిమా థియేటర్లలో రిలీజైన కేవలం 12 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

OTT Movie: మొన్ననే థియేటర్లలో రిలీజ్.. అప్పుడే ఓటీటీలోకి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
OTT Movie
Basha Shek
|

Updated on: May 18, 2026 | 1:01 PM

Share

హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 223లో వీరి వివాహం జరగ్గా ఇటీవలే ఈ దంపతులకు ఒక బాబు కూడా పుట్టాడు. అయితే పెళ్లైన తర్వాత సినిమాలు బాగా తగ్గించింది లావణ్య. గ్లామరస్ రోల్స్ కు పూర్తిగా దూరంగా ఉంటోంది. కేవలం కంటెంట్ బేస్డ్ సినిమాలకే ప్రాధాన్యమిస్తోంది. అలా పెళ్లైన తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన మొదటి సినిమా ‘సతీ లీలావతి’. గతంలో ఎస్ఎంఎస్, భీమిలి కబడ్డీ జట్టు వంటి మంచి సినిమాలు తీసిన తాతినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించాడు. మడోన్నా సెబాస్టియన్ సెకెండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. మే08న థియేటర్లలో విడుదలైన సినిమా పెద్దగా ఆడలేదు. లావణ్య త్రిపాఠి అందంగా కనిపించినా, నటనతో ఆకట్టుకున్నా సినిమాలో అసలు సరుకు లేకపోవడంతో త్వరగానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడీ సతీలీలావతి సినిమా రెండు వారాలైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

‘సతీ లీలావతి’ సినిమా బుధవారం (మే 20) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంటే థియేటర్లలో రిలీజైన 12 రోజులకే ఓటీటీలోరానుందన్నమాట. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సన్ నెక్ట్స్ ఓటీటీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రేమ, పెళ్లి, విడాకుల తదితర అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు తాతినేని సత్య. వీకే నరేష్‌, వీటీవీ గణేషన్‌, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నాగ మోహన్ నిర్మాతగా వ్యవహరించారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

సన్ నెక్ట్స్ లో లావణ్య త్రిపాఠి కొత్త సినిమా సతీలీలావతి..

మరో 2 రోజుల్లో  స్ట్రీమింగ్ కు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us