Sivamani: బాలసుబ్రహ్మణ్యంను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న శివమణి..

|

Jul 25, 2024 | 5:37 PM

శివమణి తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ లో తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు శివమణి. ఈ ఎపిసోడ్ లో తన గురువు, దివంగత సింగర్ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం తనకు పంపించిన చివరి వాయిస్ నోట్ ను వినిపించారు శివమణి.

Sivamani: బాలసుబ్రహ్మణ్యంను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న శివమణి..
Shivamani
Follow us on

దిగ్గజ డ్రమ్మర్ ఆనందన్ శివమణి తన గాడ్ ఫాదర్, లెజెండ్రీ సింగర్ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. శివమణి తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ లో తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు ఆయన. అలాగే ఈ ఎపిసోడ్ లో తన గురువు, దివంగత సింగర్ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం తనకు పంపించిన చివరి వాయిస్ నోట్ ను వినిపించారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం వాయిస్ వినగానే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 షో ఒక్కసారిగా ఎమోషనల్ గా మారింది. ఇందుకు సంబందించిన ప్రోమోను విడుదల చేసింది ఆహ.

ఇది కూడా చదవండి : Tollywood : ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇండియానే షేక్ చేస్తున్న హీరోయిన్ ఆమె..

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 షో ప్రతి శుక్రవారం అలాగే శనివారం రాత్రి 7 గంటల నుంచి ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ‘డ్రమ్స్ శివమణి’ అని పిలుచుకునే ఆనందన్ శివమణి, తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 వేదికపై స్పెషల్ జడ్జ్ గా హాజరయ్యారు. ఈ షోలో బాలసుబ్రహ్మణ్యంను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం మార్గదర్శకత్వంలో తన వృత్తిని ప్రారంభించారు శివమణి. ఆయనతో ఎంతో అనుబంధం ఉందని, ఎన్నో మెమొరీస్ ఉన్నాయని ఆయన అన్నారు. అలాగే బాలసుబ్రహ్మణ్యం తనకు చివరిగా పంపిన వాయిస్ నోట్‌ను శివమణి మైక్ లో ప్లే చేశారు. దాంతో అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

భయపడ్డాను.

ఇది కూడా చదవండి : Krishna Vamsi: ఆయన్ని అలా చూస్తే నేను తట్టుకోలేను.. కన్నీళ్లు పెట్టుకున్న కృష్ణవంశీ

ప్రతి ఏడాది గురుపౌర్ణమి రోజు ఆయనను నేను పిలుస్తాను. జూలై 21, 2024న జరిగిన గురు పూర్ణిమ రోజున ఆయనను తలుచుకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు శివమణి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు.  బాలసుబ్రహ్మణ్యంతో కలిసి 12 ఏళ్ల వయస్సులో తన మొదటి విమాన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. థమన్ తన తండ్రి మరణంతో సహా ఆయన ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా మాట్లాడారు. ఆ కష్ట సమయాల్లో శివమణి తనకు మద్దతుగా నిలిచారని అన్నారు. అలాగే థమన్ మాట్లాడుతూ, “మా నాన్న చనిపోయిన తర్వాత, నేను మా అమ్మ, నా సోదరిని చూసుకోవడంపై దృష్టి పెట్టాను, కానీ నేను ఎప్పుడూ ఏడవలేదు. ప్రతి అక్టోబర్‌లో, శివమణి గారు అయ్యప్ప మాల ధరించి శబరిమలకి వెళ్తారు. కానీ నా కష్టకాలంలో మమ్మల్ని కలవడానికి ఆయన ఆ మాల తీసేసి వచ్చారు. అప్పుడు ఆయన్ని చూడగానే నేను ఏడ్చేశాను అని తెలిపారు థమన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.