Cinema : ఏం సినిమా రా బాబూ.. 100 కోట్లతో తీస్తే 12 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. ఓటీటీలో దుమ్మురేపింది..

భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల సంవత్సరాలలో చాలా మెగా బడ్జెట్ చిత్రాలు పరాచయం పాలయ్యాయి. కానీ థియేటర్లలో రాణించలేకపోయిన సినిమాలు ఓటీటీలో మాత్రం దూసుకుపోతున్నాయి. ఇప్పుడు అలాంటి ఒక సినిమా గురించి తెలుసుకుందామా. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరెంటో తెలుసుకుందామా.

Cinema : ఏం సినిమా రా బాబూ.. 100 కోట్లతో తీస్తే 12 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. ఓటీటీలో దుమ్మురేపింది..
Auron Mein Kahan Dum Tha

Updated on: Oct 17, 2025 | 10:24 PM

ఇటీవల కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. కానీ భారీ బడ్జెట్ తో నిర్మించి..అంచనాల మధ్య విడుదలైన కొన్ని సినిమాలు మాత్రం నిరాశ పరిచాయి. ప్రస్తుతం థియేటర్లలో డిజాస్టర్ అయిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది. ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక వారం కూడా మంచి వసూళ్లను సాధించలేదు. ఇందులో స్టార్ హీరోహీరోయిన్స్ నటించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, టబు, జిమ్మీ షెర్గిల్, సాయి మంజ్రేకర్ నటించినప్పటికీ అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమా పేరు “ఔరోన్ మే కహాన్ దమ్ థా”. నివేదికల ప్రకారం, ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాతలు ₹100 కోట్లు ఖర్చు చేశారు. కానీ అది రూ.12.91 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

“ఔరోన్ మే కహాన్ దమ్ థా” సెప్టెంబర్ 27న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత హిట్ అయింది. ప్రైమ్ వీడియోలో నంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉన్న “ఔరోన్ మే కహాన్ దమ్ థా” చిత్రాన్ని ఓటీటీ సినీ ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు. ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. అతను 16 సంవత్సరాల క్రితం ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాడు, కానీ నిర్మాత దొరకలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..

ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించినప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ పై సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఈ మూవీ థియేటర్లలో నిరాశ పరిచింది. అయితే ఓటీటీలో మాత్రం ఈ మూవీ దూసుకుపోయింది. ఇప్పటికీ ఈ సినిమా ట్రెండింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..