Rules Ranjan OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

|

Nov 18, 2023 | 3:58 PM

ప్రస్తుతం థియేటర్లలో రిలీజైన నెల రోజులకే సినిమాలో ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. కొన్ని మూవీస్‌ అయితే మూడు వారాలకే డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేస్తున్నాయి. అదే సమయంలో అఖిల్ అక్కినేని ఏజెంట్‌ లాంటి సినిమాలు నెలలు గడిచినా ఓటీటీలోకి రావడం లేదు. అలా ఓటీటీలోకి రాని సినిమాల్లో కిరణ్‌ అబ్బవరం రూల్స్‌ రంజన్‌ కూడా ఉంది. అక్టోబర్‌ 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో లో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది.

Rules Ranjan OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం రూల్స్‌ రంజన్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Rules Ranjan Movie
Follow us on

ప్రస్తుతం థియేటర్లలో రిలీజైన నెల రోజులకే సినిమాలో ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. కొన్ని మూవీస్‌ అయితే మూడు వారాలకే డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేస్తున్నాయి. అదే సమయంలో అఖిల్ అక్కినేని ఏజెంట్‌ లాంటి సినిమాలు నెలలు గడిచినా ఓటీటీలోకి రావడం లేదు. అలా ఓటీటీలోకి రాని సినిమాల్లో కిరణ్‌ అబ్బవరం రూల్స్‌ రంజన్‌ కూడా ఉంది. అక్టోబర్‌ 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో లో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. సమ్మోహనుడా వంటి సూపర్‌ హిట్‌ మెలోడి సాంగ్‌, టీజర్స్‌, ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమాపై విడుదలకు మంచి అంచనాలే ఉన్నాయి. తీరా థియేటర్లలోకి వచ్చిన తర్వాత రూల్స్‌ రంజన్‌ దారుణంగా నిరాశపర్చింది. చివరకు సమ్మోహనుడా పాట మాత్రమే ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇలా థియేటర్లలో నిరాశపర్చిన రూల్స్‌ రంజన్‌ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్ వీడియో కిరణ్‌ అబ్బవరం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజుకు ముందు మూవీపై మంచి అంచనాలు ఉండడంతో భారీ ధరకే డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 1 నుంచి రూల్స్‌ రంజన్‌ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

ప్రముఖ నిర్మాత ఏఎమ్‌ రత్నం తనయుడు జ్యోతికృష్ణ రూల్స్‌ రంజన్‌ సినిమాకు దర్శకత్వం వహించారు. స్టార్ లైట్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ మూవీలో మెహర్‌ చాహల్‌ సెకెండ్‌ హీరోయిన్‌గా నటించింది. వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు, హైపర్‌ ఆది, హర్ష చెముడు, నాగినీడు, మకరంద్‌ దేశ్‌ పాండే, సుదర్శన్‌, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్‌ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. అమ్రీశ్ సంగీతం అందించారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాల్లో నటించాడు కిరణ్‌ అబ్బవరం. వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్‌, రూల్స్‌ రంజన్‌ సినిమాల్లో మెరిశాడీ యంగ్‌ హీరో. అయితే ఇందులో వినరో భాగ్యము విష్ణు కథ మూవీ మాత్రమే హిట్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

రూల్స్ రంజన్ సినిమాలో కిరణ్, నేహా శెట్టి..

సూపర్ హిట్ గా నిలిచిన సమ్మోహనుడా  ఫుల్ సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.