K Ramp OTT: ఆహా ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ మూవీ.. కె ర్యాంప్ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే కె ర్యాంప్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో యుక్తి తరేజా కథానాయికగా నటించగా.. లవ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యేందుకు రెడీ అయ్యింది.

K Ramp OTT: ఆహా ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ మూవీ.. కె ర్యాంప్ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..
K Ramp

Updated on: Nov 08, 2025 | 12:16 PM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ కె ర్యాంప్. దీపావళి సందర్భంగా విడుదలైన అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇందులో యుక్తి తరేజా కథానాయికగా నటించగా.. డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్ అయ్యింది. ఈ సినిమాలో నరేష్ వీకే, సాయి కుమార్, కామ్నా జెఠ్మలానీ కీలకపాత్రలు పోషించగా.. ఎప్పటిలాగే తనదైన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు కిరణ్ అబ్బవరం. థియేటర్లలో సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..

కె ర్యాంప్ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 15 నుంచి ఆహాలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జైన్స్ నానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ఇదేమిటమ్మా మాయ మాయ సాంగ్ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన ఈ సూపర్ హిట్ పాటకు కె ర్యాంప్ సినిమాలతో స్టెప్పులతో అదరగొట్టారు కిరణ్ అబ్బవరం.

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ ముందుకు వచ్చిన నెల రోజుల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో కిరణ్ అబ్బవరం తన డబుల్ డోస్ కామెడీ, పంచెస్‌తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు.

ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?