బాక్సాఫీస్ వద్ద విక్రమ్ (Vikram) జోరు కొనసాగుతుంది. విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ పై సందడి చేశారు కమల్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సూర్య, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 300 కోట్లు వసూళ్లు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ విక్రమ్ మార్క్ కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టి తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది విక్రమ్ మూవీ. చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంలో కమల్ నట విశ్వరూపం చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. మరోవైపు అతిథి పాత్రలో సూర్య వచ్చిన ఆ 3 నిమిషాలు సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఇక ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న విక్రమ్.. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైందట.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్లు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. వచ్చే నెల అంటే జూలై 8 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లుగా ఫిల్మ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా.. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషన్ల్ ఫిల్మ్స్, మహేంద్రన్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని తెలుగులో యంగ్ హీరో నితిన్ నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ట్ మూవీస్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.