టాలీవుడ్ పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం కరుంగా పియం. కార్తికేయన్ (డీకే) తెరకెక్కించిన ఈ మూవీలో రైజా విల్సన్, యోగిబాబు, జనని తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు. గతేడాది మే 19న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత కార్తీక పేరుతో తెలుగులోనూ రిలీజై మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే ఒరిజెనల్ వెర్షన్ కరుంగా పియం ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడిదే హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగు ఆడియెన్స్ ను భయపెట్టేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో కార్తీక సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 9 నుంచి ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సినిమాకు సంబంధించిన ఒక కొత్త వీడియోను అందులో పంచుకుంది.
ఇక సినిమా కథ విషయానికొస్తే.. కార్తీక (రెజీనా) సరదాగా ఓ ఓల్డ్ లైబ్రరీకి వెళుతుంది .అక్కడ వందేళ్ల క్రితం నాటి ‘కాటుక బొట్టు’ అనే పుస్తకం కనిపిస్తుంది. వెంటనే ఆ బుక్ ను చదవడం ప్రారంభిస్తుంది. అయితే ఆమె పుస్తకంలో చదివే పాత్రలన్నీ దెయ్యాలుగా మారి తన ముందుకు వస్తుంటాయి. అందులో కాజల్ (కార్తిక) కూడా ఉంటుంది. పగ తీర్చుకోవాలని దెయ్యంగా మారుతుంది. మరి కాజల్ ఎలా చనిపోయింది. తన పగను ఎలా తీర్చుకుంది? ఇందులో రెజీనా పాత్ర, కాజల్ తో సంబంధమేంటో తెలుసుకోవాలంటే కార్తీక మూవీని చూడాల్సిందే. థియేటర్లలో ఈ మూవీని మిస్ అయిన వారు ఓటీటీలో ఓ లుక్కేయండి మరి.
Get ready for a bone-chilling horror experience as #KajalKarthika Premieres April 9 👻🎬#Karthika @MsKajalAggarwal @ReginaCassandra @jananihere @aadhavkk @KalaiActor @iYogiBabu #DEEKAY pic.twitter.com/ZmJZ8rES0U
— ahavideoin (@ahavideoIN) April 3, 2024
Another breathtaking movie on aha! 👻#KajalKarthika Premieres April 9#Karthika @MsKajalAggarwal @ReginaCassandra @jananihere @aadhavkk @KalaiActor @iYogiBabu #DEEKAY pic.twitter.com/W1CRC3R0uz
— ahavideoin (@ahavideoIN) April 1, 2024
Chakram thiruguthundi!🔯
Movie ee Friday vasthodi☠️ #Tantra Premieres April 05 @AnanyaNagalla @dhanush_vk @saloni_Aswani @srini_gopisetti @RaviChaith #NareshbabuP @firstcopymovies @BeTheWayFilms @TantraTheMovie pic.twitter.com/LTuof6urYI— ahavideoin (@ahavideoIN) April 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..