RRR in OTT: దక్షిణాదిలో మెగా మల్టీస్టారర్ మూవీ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ..(రౌద్రం రణం రుథిరం)..సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్నది. పాన్ ఇండియా మూవీగా తెరెక్కిన ఆర్ఆర్ఆర్ డిజిటల్ లో ఎప్పుడు రిలీజ్ కానుందో మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.
కరోనా వైరస్ విజృంభణ తర్వాత వెలుగులోకి వచ్చి.. సినిమా థియేటర్స్ మూతబడ్డాయి. దీంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఓటిటి. సూర్య వంటి స్టార్ హీరోలు సైతం డైరెక్ట్ గా ఓటిటిలోనే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇక థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు సైతం 50 రోజుల అనంతరం డిజిటల్ లో సినిమాలు ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ కూడా ఓటిటిలో 50రోజులకే రిలీజ్ అవుతుందని సినీ అభిమానులు అనుకున్నారు. అయితే ఈ సినిమా 90 రోజుల అనంతరం ఓటిటిలో ప్రసారం కానున్నది.
ఆర్ఆర్ఆర్ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ ZEE5 భారీ ధరకు దక్కించుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి చిత్ర యూనిట్ ముంబై లో జరిగిన ట్రైలర్ లాంచ్ సమయంలో క్లారిటీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ థియేటర్లలో విడుదలైన 90 రోజుల తర్వాత స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్‌లలో విడుదల చేయనున్నట్లు మూవీ నిర్మాతలు ప్రకటించారు.
పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ లో .. తారక్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలు నటిస్తున్నారు. ఈ సినిమా టోటల్ రన్ టైమ్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చిందని అంటున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం , సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది.
Also Read: వెయిటర్ పంట పండింది.. ఫుడ్ సర్వ్ చేసి ఏకంగా 7 లక్షల టిప్ అందుకుంది..