ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలు పాజిటివ్‌తో దూసుకుపోతున్నాయి. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. అటు రోజు రోజుకు ఈ రెండు చిత్రాల కలెక్షన్స్ లెక్కలు మారుతున్నాయి. మరోవైపు ఎప్పటికప్పుడు సస్పెన్స్ థ్రిల్లింగ్, కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి ఓటీటీస్. ఓవైపు థియేటర్లలో పలు చిత్రాలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నా.. అటు ఓటీటీ ఆదరణ మాత్రం తగ్గడం లేదు. థియేటర్లలో సినిమాలు చూసిన డిజిటల్ ప్లాట్ పామ్ పై స్ట్రీమింగ్ అయ్యే సినిమాల కోసం అడియన్స్ వెయిట్ చేస్తుంటారు. ప్రతి వారం వారం కొత్త కంటెంట్ అందిస్తూ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సూపర్ హిట్ మూవీస్.. వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇక మరికొన్ని చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. అందులో భోళా శంకర్ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 15న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఇప్పుడు మరో రెండు సినిమాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. అదే జర్నీ ఆఫ్ లవ్ 18+. ఇందులో నస్లీన్ కె.గపూర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అరుణ్ డి.జోస్ దర్శకత్వం వహించారు. మలయాళంలో జూలై 7న విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ నిలిచింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సోనీలివ్ లో సెప్టెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాతోపాటు మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు.
అలాంటి జాబితాలో బంబే మేరీ జాన్ చిత్రం. 1960లో ముంబై పోలీసులకు, గ్యాంగ్ స్టర్స్ కు మధ్య జరిగే పోరాటం చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. సఇందులో కేకే మీనన్, అవినాశ్ తివారి ప్రధాన పాత్రలు పోషించగా… డైరెక్టర్ సౌదాగర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈనెల 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.