OTT Movie: దడ పుట్టించే సీన్లు.. ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమాలో వివాదాస్పద అంశాలు చాలా ఉన్నాయని కామెంట్స్ వినిపించాయి. సమాజంలోని ఓ వర్గం ఈ మూవీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి కాంట్రవర్సీ కంటెంట్ తో నే మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ మంగళవారం (ఏప్రిల్ 07) ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయనున్నాయి. అయితే మంగళవారం (ఏప్రిల్ 07) నుంచే ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక కాంట్రవర్సీ సినిమా. హారర్ థ్రిల్లర్ జానర్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. గత ఏడాది నవంబర్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అదే సమయంలో ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. జీసస్ చిన్ననాటి కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో బైబిల్‌కు సంబంధించి పలు వివాదాస్పద అంశాలను టచ్ చేశారని, ఒక పవిత్రమైన కథలా కాకుండా ఇష్టమొచ్చిన రీతిలో రూపొందించారని విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా జీసస్‌గా చూపించిన పాత్రను దైవంలా కాకుండా అతీంద్రియ శక్తులు వచ్చినట్లుగా, నోట్లో పాములు రావడం వంటి సీన్లతో తెరకెక్కించారని చిత్ర బృందంపై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి.
కాంట్రవర్సీ కంటెంట్ తోనే కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా పేరు ది కార్పెంటర్స్ సన్. ఇదొక హాలీవుడ్ సినిమా. లోట్ఫీ నాథన్ తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలో ఘోస్ట్ రైడర్ ఫేమ్, హాలీవుడ్ స్టార్ హీరో నికోలస్ కేజ్ హీరోగా నటించడం విశేషం. ఆయనతోపాటు నోవా జుప్, ఎఫ్‌కేఏ ట్విగ్స్, ఐస్లా జాన్‌స్టన్, సౌహీల యాకూబ్, కైతి మనోలిడకి తదితరులు ఈ మూవీలో ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తోపాట తెలుగు, హిందీ, తమిళం భాషల్లోనూ ది కార్పెంటర్స్ సన్ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.
జియో హాట్ స్టార్ లో ది కార్పెంటర్స్ సన్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
Nicolas Cage stars in #TheCarpentersSon
Also starring FKA Twigs, Noah Jupe, and Isla Johnston
In theaters November 14pic.twitter.com/9BNMIfJwY9
— Geek Vibes Nation (@GeekVibesNation) October 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




