Jathi Ratnalu OTT: ‘జాతిరత్నాలు’ ఓటీటీ విడుదలకు రంగం సిద్ధం.. డిజిటల్‌ స్క్రీన్‌పై నవ్వులు పూయించేది అప్పుడేనా..?

|

Mar 12, 2021 | 4:50 PM

Jathi Ratnalu OTT Release Date: 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస అత్రేయ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు నటుడు నవీన్‌ పొలిశెట్టి. ఈ సినిమాలో ఓ వైపు ఇన్వెస్టిగేటివ్‌ ఏజెంట్‌గా సీరియస్‌గా కనిపిస్తూనే మరోవైపు తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడీ యంగ్‌ హీరో. ఇక ఈ సినిమా తర్వాత...

Jathi Ratnalu OTT: జాతిరత్నాలు ఓటీటీ విడుదలకు రంగం సిద్ధం.. డిజిటల్‌ స్క్రీన్‌పై నవ్వులు పూయించేది అప్పుడేనా..?
Jathi Ratnalu Ott Releasing
Follow us on

Jathi Ratnalu OTT Release Date: ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస అత్రేయ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు నటుడు నవీన్‌ పొలిశెట్టి. ఈ సినిమాలో ఓ వైపు ఇన్వెస్టిగేటివ్‌ ఏజెంట్‌గా సీరియస్‌గా కనిపిస్తూనే మరోవైపు తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడీ యంగ్‌ హీరో. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో మరోసారి ‘జాతి రత్నాలు’ మూవీతో సందడి చేయడానికి వచ్చాడు నవీన్‌.
విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహానటి ఫేమ్‌ నాగ అశ్విన్‌ నిర్మాతగా వ్యవహరించడం, కీర్తి సురేష్‌, విజయ్‌ దేవరకొండ గెస్ట్‌ రోల్‌లో నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. దీంతో మొదటి షో నుంచే సినిమా సక్సెస్‌ టాక్‌తో దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే జాతి రత్నాలు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ మంచి కలెక్షన్లను రాబట్టింది. తొలిరోజు ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 3.82 కోట్లు రాబట్టడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. జాతి రత్నాలు డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమేజాన్‌ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను అమేజాన్‌ ప్రైమ్‌ ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మంచి టాక్‌తో దూసుకెళుతోన్నా.. ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు కేవలం 30 రోజుల్లోపే ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరి వెండితెరపై నవ్వుల జల్లు కురిపించిన జాతి రత్నాలు.. డిజిటల్‌ స్క్రీన్‌పై ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఏరియా పరంగా ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే.. జాతిరత్నాలు విడుదల రోజు నైజాంలో రూ.1.45 కోట్లు, సీడెడ్‌ రూ.0.55 కోట్లు, యూఏ రూ.0.50 కోట్లు, గుంటూరు రూ.0.39 కోట్లు, ఈస్ట్‌ రూ.0.29 కోట్లు, వెస్ట్‌ రూ. 0.28 కోట్లు, క్రిష్ణ రూ.0.25 కోట్లు, నెల్లూరు రూ.0.11 కోట్లు వసూలు చేసింది. హిట్‌ టాక్‌ రావడంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరగనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: Actor Manoj Bajpayee: కరోనా బారినపడ్డ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్​పాయ్​.. షూటింగ్‌ సమయంలో వైరస్ వ్యాప్తి

Prabhas Adipurush: రాముడికి సీత దొరికింది..! ప్రభాస్‌ సరసన నటించేది ఆ భామే.. వైరల్‌గా మారిన ఫొటోలు..

Gummadi Narsaiah Biopic: 5 సార్లు ఎమ్మెల్యే.. అత్యంత సాధారణ జీవితం.. త్వరలో ఆయన బయోపిక్ !