ఇటీవల కొన్ని సినిమాలు చడీ చప్పుడు లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ఎలాంటి ముందస్తు ప్రకటన, సమాచారం లేకుండా ఓటీటీలో సందడి చేస్తున్నాయి. గత వారం నిఖిల్ నటించిన స్పై సినిమా కూడా సైలెంట్‌గా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. అలా తాజాగా మరొక సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇటీవల థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకున్న రుద్రాంగి సినిమా మూడు వారాలకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అందుబాటులోకి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భారీ బడ్జెట్‌తో ఈ పీరియాడికల్ ఫిల్మ్‌ను రూపొందించడం విశేషం. జగపతిబాబుతో పాటు విమలారామన్, మమతా మోహన్ దాస్, గానవి లక్ష్మణ్, ఆశిష్ గాంధీ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. తెలంగాణ దొరల నేపథ్యంలో కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని అజయ్ సామ్రాట్ ఈ మూవీని తెరెక్కించారు. బాహుబలి మూవీకి అజయ్ సామ్రాట్‌నే రైటర్‌గా వ్యవహరించడం విశేషం. బాలకృష్ణ లాంటి స్టార్ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టే జూలై 7న థియేటర్లలో విడుదలైన రుద్రంగి డీసెంట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రుద్రంగి స్ట్రీమింగ్ అవుతోంది.
రుద్రంగి మూవీలో భీమ్‌రామ్ దేశ్‌ముఖ్ అనే దొర పాత్రలో జగపతిబాబు నటించాడు. ఆయన ఇద్దరి భార్యల పాత్రలో మీరాబాయి (విమలారామన్), జ్వాలాబాయి (మమతా మోహన్ దాస్) కనిపించారు. ఆడవాళ్లంటే తెగ మోజు చూపించే జగ్గూభాయ్ రుద్రంగి అనే అమ్మాయిపై మనసు పడతాడు. ఆమెను సొంతం చేసుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తాడు. అయితే మల్లేష్ (ఆశీష్ గాంధీ) దొరకు ఎదురుతిరిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రుద్రంగి సినిమా చూడాల్సిందే. తెలంగాణ గఢీలు, దొరల నేపథ్య కథాంశంతో వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. మరి థియేటర్లలో రుద్రంగి సినిమాను మిస్ అయిన వారు ఎంచెక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.
#Rudrangi OTT RELEASE NOW@PrimeVideoIN pic.twitter.com/7DebOlT27i
— OTTGURU (@OTTGURU1) August 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..