OTT Movie: కన్న తండ్రిని కొడుకు ఎందుకు హత్య చేయాలనుకున్నాడు? ఓటీటీలోకి లేటెస్ట్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. అయితే ఇటీవల కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ నెల రోజుల గడవకముందే డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అలా ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వస్తోంది.

OTT Movie: కన్న తండ్రిని కొడుకు ఎందుకు హత్య చేయాలనుకున్నాడు? ఓటీటీలోకి లేటెస్ట్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Movie

Updated on: Mar 05, 2025 | 9:57 PM

జబర్దస్త్ ఫేమ్, స్టార్ కమెడియన్ ధన్‌ రాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామం రాఘవం. ధన్ రాజ్ తో పాటు మరో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్ర ఖని ఇందులో మరో కీలక పాత్ర పోషించాడు. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముందు నుంచి చాలామంది అనుకున్నబలగం తరహాలో లేకపోయినా ఉన్నంతలో డీసెంట్ మూవీ అనిపించుకుంది. కథ, టేకింగ్ పరంగా రామం రాఘవం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే డైరెక్టర్ గా ధన్ రాజ్ కు కూడా మంచి మార్కులే పడ్డాయి. అయితే పేరున్న పెద్ద నటీనటులు లేకపోవడం రామం రాఘవం సినిమాకు మైనస్ గా మారిపోయంది. అందుకే ఈ మూవీ ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేకపోయింది. అయితే ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మీదకు వస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ రామం రాఘవం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా అ సినిమాపై కీ అప్డేట్ ఇచ్చింది. మార్చి 14 నుంచి రామం రాఘవం సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో సినిమా పోస్టర్ ను కూడా షేర్ చేసింది. ‘ఈ తండ్రీకొడుకుల ప్రయాణం మీరు ఊహించలేనిది’ అని దీనికి క్యాప్షన్ ఇచ్చింది.

కాగా రామం రాఘవం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ఈటీవీ విన్ వద్ద కూడా ఉన్నాయి. ఇటీవలే ఈ వివరాలను సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఈటీవీ విన్ సంస్థ. త్వరలోనే రిలీజ్‌ చేస్తామని వెల్లడించిన సంస్థ ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై పృథ్వి పోలవరపు రామం రాఘవం సినిమాను నిర్మించారు.సునీల్ , మోక్ష సేన్‌గుప్తా, హరీష్ ఉత్తమన్, వెన్నెల కిషోర్, సత్య, పృథ్వీ రాజ్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, రచ్చ రవి,ఇంటూరి వాసు, రాకెట్ రాఘవ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విమానం’ సినిమా దర్శకుడు శివప్రసాద్ యానాల స్టోరీ అందించగా, అరుణ్ చిలువేరు సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మార్చి 14 నుంచి సోనీ లివ్ లో..

ఈటీవీ విన్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.