
ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ సినిమాలకు బాగా ఆదరణ దక్కుతోంది. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు ఆడియెన్స్ కు అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా ఇటీవల వచ్చిన ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆడియెన్స ను కట్టి పడేస్తోంది. ఊహించని ట్విస్టులతో మతిపోగోట్టేలా చేస్తోంది. చివరి వరకు ఈ సస్పెన్స్ కొనసాగడం ఆడియెన్స్ ను బాగా థ్రిల్ కు గురి చేస్తోంది. ఈ సినిమా కథ విషయాని వస్తే.. ఒక మహా నగరంలో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. అయితే చంపే ముందు వారినిపెళ్లికూతురిలా అలంకరిస్తుంటాడు సైకో. ఆ తర్వాత ఛిత్ర వద చేసి చంపుతుంటాడు. అలా నగరంలో చాలా మంది పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు ఈ సైకో చేతిలో దారుణంగా హత్యకు గురవుతారు. చివరకు ఇన్స్పెక్టర్ భార్యని కూడా కిడ్నాప్ చేసి ఒక శవపేటికలో పూడ్చి పెడతాడు. నీ భార్యని బ్రతికించుకో అని హీరోకి సవాల్ విసురుతాడు. మరిచివరికి హీరో తన భార్య ను కాపాడుకుంటాడా? పోలీసులు ఈ సైకోను పట్టుకున్నారా? అసలు ఆ సైకో ఎందుకిలా చేస్తున్నాడు? అమ్మాయిలు పెళ్లి కూతురిలా అలంకరించి చంపాల్సిన అవసరమేముంది? అన్నది తెలుసుకోవాలంటే ‘చాల్చిత్రో’ అనే బెంగాలీ సినిమా చూడాల్సందే.
2024 లో విడుదలైన ‘చాల్చిత్రో’ సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మూవీని చూసేయచ్చు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని రకాల బాధ్యతలను ప్రతిమ్.డి. గుప్తా నే తీసుకున్నారు. ఇందులో తెలుగులో ధైర్యం సినిమాలో హీరోయిన్ గా నటించిన రైమా సేన్ ఒక కీలక పాత్రలో నటించింది. అలాగే తోటరాయ్ చౌదరి,అనిర్బన చక్రవర్తి,తనికా బాస, శాంతాను మహేశ్వరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే మీకు ఇష్టమా? అయితే ఈ వీకెండ లో ఛాల్చిత్రో సినిమాపై ఒక లుక్ వేసుకోవచ్చు.
Revenge is a dish best served cold!
Presenting the official trailer of #Chaalchitro. Film releasing on 20th December.
BookMyShow Link: https://t.co/YIL197DDgR pic.twitter.com/BPmSkcOVmn
— Pratim Dasgupta (@PratimDGupta) December 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.