ప్రపంచకప్ జాతర ముగిసింది. మరోసారి భారత్ ప్రపంచ కప్ ముద్దాడుతుందని అందరూ ఆశపెట్టుకున్నా.. ఆ ఆశలను ఆవిరి చేసి ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ను ముద్దాడింది. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రపంచ కప్ నుండి భారీగా డబ్బు సంపాదించింది. ఒకవైపు 5 కోట్ల మంది వీక్షకులుగా రికార్డు సృష్టించగా మరోవైపు స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనల ద్వారా వేలకోట్ల ఆదాయం లభించింది. వాస్తవానికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వరల్డ్ కప్ 2023 మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారాన్ని చేసింది. ఉచితంగా మ్యాచ్‌లను చూసే అవకాశాన్ని అందించింది. అయినప్పటికీ డిస్నీ హాట్‌స్టార్ కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. ఆదివారం డిస్నీ-హాట్‌స్టార్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను ఏకకాలంలో 5.9 కోట్ల మంది వీక్షకులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ గణాంకాల కారణంగా OTT ప్లాట్‌ఫారమ్ ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అదే సమయంలో హాట్‌స్టార్ కూడా ఈ సమయంలో ప్రకటనల ద్వారా బంపర్ ఆదాయాన్ని సంపాదించింది. అయితే ఇప్పుడు భారత్ ఫైనల్ లో ఓటమి తర్వాత దీని షేర్లు, మార్కెట్ క్యాప్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తెలుసుకుందాం..
ఆదివారం హాట్‌స్టార్‌లో 5.5 కోట్ల మంది ఉచితంగా మ్యాచ్‌ను వీక్షించారు. అయితే భారత్ వికెట్లు.. పేకముక్కల్లా టకాటకా పడటం ప్రారంభించాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత వీక్షకుల సంఖ్య కొన్ని సెకన్లలో 4.6 కోట్లకు పడిపోయింది.
ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగగానే మళ్లీ ప్రేక్షకుల సంఖ్య పెరగడం మొదలైంది. ముఖ్యంగా పవర్‌ప్లే సమయంలో ఆస్ట్రేలియా రెండు ప్రధాన వికెట్లను భారత్ పడగొట్టింది. అప్పుడు మళ్ళీ వీక్షకుల సంఖ్య పెరిగింది. డిస్నీ-హాట్‌స్టార్ ప్రకారం ఈ రికార్డుతో భారతదేశం.. న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో చేసిన 5.3 కోట్ల మంది వీక్షకుల రికార్డు కూడా బద్దలైంది. ఇంతకుముందు, భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌ను ఇప్పటి వరకు అత్యధికంగా 4.4 కోట్ల మంది వీక్షకులు ఏకకాలంలో ప్రత్యక్షంగా వీక్షించారు. అదే సమయంలో అక్టోబర్ 22న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను ఏకకాలంలో 4.3 కోట్ల మంది వీక్షకులు ప్రత్యక్షంగా వీక్షించగా.. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను ఏకకాలంలో 3.5 కోట్ల మంది వీక్షించారు.
నివేదికల ద్వారా.. ప్రపంచ కప్ ఫైనల్ సమయంలో హాట్‌స్టార్ ప్రకటనల రేటును 10 సెకన్లకు రూ. 35 లక్షలకు పెంచింది. భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ అత్యంత భారీ మ్యాచ్ కనుక సంపాదనకు ఇదే అతిపెద్ద అవకాశం అని భావించిన స్టార్ యాజమాన్యం యాడ్స్ రేటును పెంచినట్లు తెలుస్తోంది. అయితే సభ్యత్వం నుండి ఆదాయాన్ని సంపాదించకపోయినా.. వీక్షణ, వినియోగదారుల పెరుగుదల నుండి మంచి ఆదాయాన్ని సంపాదించింది.
ఈ ప్రపంచ కప్ ద్వారా హాట్ స్టార్ కు స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలను అందుకుంది. ప్రపంచకప్ తొలి మ్యాచ్ అక్టోబర్ 5న ప్రారంభమైంది. అక్టోబర్ 4న.. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో డిస్నీ షేర్లు $79.32 వద్ద ఉన్నాయి. ఇందులో దాదాపు 19 శాతం వృద్ధి కనిపించి కంపెనీ వాటా $94.15కి చేరింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆదివారం ఫైనల్‌లో భారత్ ఓటమి తర్వాత డిస్నీ షేర్లు పడిపోయే అవకాశం ఉంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..