Fighter OTT: ‘ఫైటర్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. హృతిక్‌, దీపికల మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

|

Mar 04, 2024 | 12:51 PM

బాలీవుడ్‌ గ్రీకు వీరుడు హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ఫైటర్‌. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్ కమ్ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటించింది. అనిల్‌ కపూర్‌ మరో కీలక పాత్రలో మెరిశాడు. గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న థియేటర్లలో రిలీజైంది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యానికి దేశ భక్తిని జోడించి తెరకెక్కించిన ఫైటర్‌ ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకుంది.

Fighter OTT: ఫైటర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. హృతిక్‌, దీపికల మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
Fighter Movie
Follow us on

బాలీవుడ్‌ గ్రీకు వీరుడు హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ఫైటర్‌. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్  సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటించింది. అనిల్‌ కపూర్‌ మరో కీలక పాత్రలో మెరిశాడు. గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న థియేటర్లలో రిలీజైంది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యానికి దేశ భక్తిని జోడించి తెరకెక్కించిన ఫైటర్‌ ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు సుమారు రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో హృతిక్‌ సినిమాను వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ముఖ్యంగా ఎయిర్‌ ఫోర్స్‌ యూనిఫాంలో హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ మధ్య లిప్ లాక్ సీన్స్‌, రొమాంటిక్‌ సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయమై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధాన అధికారి ఒకరు ఫైటర్ సినిమాకు లీగల్ నోటీసులు కూడా పంపారు. ఇలా కలెక్షన్లతో పాటు కాంట్రవర్సీల చుట్టూ తిరుగుతున్న ఫైటర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌పామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ హృతిక్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 21 నుంచి ఫైటర్ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

భారతదేశంలోనే తొలి ఎయిర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ‘ఫైటర్’ గుర్తింపు పొందింది. ఇందులో అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజిదా షేక్‌, అశుతోష్ రాణా, రిషబ్‌, తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ పిక్చర్చ్‌ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఫైటర్‌ సినిమాను నిర్మించాయి. విశాల్‌ శేఖర్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

 

ఐఏఎఫ్ లీగల్ నోటీసులు

హృతిక్ రోషన్ ట్విటర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.