Disney + hotstar new subscription plans: ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. రానున్న రోజుల్లోనూ ఓటీటీకి ఆదరణ పెరుగుతుందని గణంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. దీంతో ఓటీటీ సేవల మధ్య పోటీకూడా బాగా పెరిగింది. ఈ కారణంగానే యూజర్లను పెద్ద ఎత్తున ఆకట్టుకునే పనిలో పడ్డ ఓటీటీ సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్ స్టార్ తాజాగా కొత్తగా మూడు ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం డిస్నీ+హాట్ స్టార్ వీఐపీ సేవలు ఏడాదికి రూ. 399 అందిస్తుండగా, డిస్నీ+హాట్ స్టార్ ప్రీమియమ్‌ను రూ. 1499కు అందిస్తోంది. వీటితో పాటు మరో మూడు ప్లాన్స్‌ను పరిచయం చేసింది హాట్‌స్టార్. కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్లాన్స్ సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
* హాట్ స్టార్ తీసుకొచ్చిన కొత్త ప్లాన్ రూ. 499. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో ఒక ఏడాది పాటు డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం సేవలను పొందొచ్చు. అయితే ఈ ప్లాన్ ద్వారా కేవలం ఒక్కరు మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో హెచ్‌డీలో వీడియోలను చూడొచ్చు.
* హాట్‌స్టార్ తీసుకొచ్చిన మరో ప్లాన్.. రూ. 899ను కూడా ప్రకటించింది. ఈ ప్లాన్‌తో ఇద్దరు యూజర్లు డిస్నీ+హాట్‌స్టార్ సేవలను ఉపయోగించుకునే అవకాశం కల్పించారు.
* ఇక మూడో ప్లాన్ విషయానికొస్తే.. ఏడాదికి రూ. 1499 చెల్లిస్తే నలుగురు యూజర్లు యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు 4కే స్ట్రీమింగ్ అదనపు బెనిఫిట్.
ఇదిలా ఉంటే కొత్త ప్లాన్స్‌ను ప్రకటించిన హాట్‌స్టార్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వీఐపీ ప్లాన్ రూ. 399, రూ. 299 ప్లాన్లను నిలిపివేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Twitter Voice: ఇకపై టైపింగ్ చేయాల్సిన అవసరం లేదు, చెబితే చాలు.. ట్విట్టర్‌లో మరో అద్భుత ఫీచర్..
OPPO Phone: ఒప్పో కొత్త 5జీ ఫోన్..లేటెస్ట్ ఫీచర్స్..దీని ధర ఎంతంటే..