
గత వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందులో ఓ వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. అనుక్షణం ఉత్కంఠ రేపే సీన్స్, ఊహకు అందని ట్విస్టులతో సాగే ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇందులో సస్పెన్స్, హారర్, క్రైమ్, థ్రిల్లింగ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఐఎమ్‌డీబీలోనూ ఈ సిరీస్ కు టాప్ రేటింగ్ ఉండడం విశేషం. మరొక విశేషమేమిటంటే.. ఈ హిందీ ఒరిజినల్ సిరీస్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉంది
ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ రాత్రి పూట వీధులలో, భయంతో పరుగెత్తే అమ్మాయితో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. కనిపించని ఒక అదృశ్య శక్తి ఆమెను కప్పేస్తుంటుంది. దీని కారణంగా ఆ మహిళ ఓ హోటల్ విండో కిటీకీ నుంచి కిందకు పడిపోయి చనిపోవడానికి కారణమవుతుంది. ఈ దృశ్యాన్ని జే షేథ్ అనే ఒక మెడికల్ స్టూడెంట్ చూస్తాడు. జే తన ఆలోచనలు, హల్యూసినేషన్లు, గురించి రుమీ తో షేర్ చేసుంటూంటాడు. ఆమె ముంబైలోని పారానార్మల్ ఘటనలపై యూట్యూబ్ వీడియోలు చేస్తుంటుంది. దీంతో ఇద్దరూ కలిసి మహిళను కప్పేసిన ఆ అదృశ్య శక్తి మిస్టరీ ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలో జే షేథ్ సోదరుడు కూడా ఓ ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతాడు. అతన్ని కూడా అదృశ్య శక్తి కమ్ముకుంటుంది. అసలు ఈ అదృశ్య శక్తి ఏమిటి? పోలీసుల విచారణలో ఎలాంటి నిజాలు వెలుగు చేశాయి? అనే విషయం తెలియాలంటే ఈ సిరీస్ పూర్తి గా చూడాల్సిందే.
ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ పేరు. ఆగస్టు 14 అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మీరు థ్రిల్లర్స్ సినిమాలు, సిరీస్ లను ఇష్టపడితే ఈ ‘అంధేరా’ మీకు తప్పకుండా నచ్చుతుంది.
As the city sleeps, Andhera awakens 🫣#AndheraOnPrime, New Series, Aug 14@bapat_priya @Karanvirm1 @iamMostlySane @SurveenChawla @PachauriPranay @shethvatsal @parvindabas @RaaghavDar #GauravDesai @ritesh_sid @FarOutAkhtar @J10kassim #MohitShah @krnx @vishalrr @excelmovies… pic.twitter.com/QYti7c9Kbl
— prime video IN (@PrimeVideoIN) August 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.