The Great Indian Suicide OTT: వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్‌ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడొచ్చంటే?

కొన్నేళ్ల క్రితం మ‌ద‌న‌ప‌ల్లె పట్టణంలో జ‌రిగిన సామూహిక హత్యల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌. ఇటీవల ఓదెల రైల్వే స్టేషన్‌, వ్యవస్థ సినిమాలతో ఓటీటీ ఆడియెన్స్‌ను బాగా అలరించిన హెబ్బా పటేట్‌ ఇందులో కీలక పాత్ర పోషించింది. విప్లవ్ కొనేటి దర్శకత్వం తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ కార్తీ, వీకే నరేశ్, పవిత్రా లోకేశ్, జయప్రకాశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

The Great Indian Suicide OTT: వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్‌ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడొచ్చంటే?
The Great Indian Suicide Movie

Updated on: Oct 06, 2023 | 6:35 AM

కొన్నేళ్ల క్రితం మ‌ద‌న‌ప‌ల్లె పట్టణంలో జ‌రిగిన సామూహిక హత్యల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌. ఇటీవల ఓదెల రైల్వే స్టేషన్‌, వ్యవస్థ సినిమాలతో ఓటీటీ ఆడియెన్స్‌ను బాగా అలరించిన హెబ్బా పటేట్‌ ఇందులో కీలక పాత్ర పోషించింది. విప్లవ్ కొనేటి దర్శకత్వం తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ కార్తీ, వీకే నరేశ్, పవిత్రా లోకేశ్, జయప్రకాశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. టీజర్లు, పోస్టర్స్‌, ట్రైలర్‌తో ఆసక్తిని రేకెత్తించిన ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్ అన్ని హంగులు పూర్తి చేసుకుని డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో శుక్రవారం (అక్టోబర్‌ 6) నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఆహా. ‘చావును శాసించడం సాధ్యమా? మాట్లాడుకుందాం. ఈ అసాధారణమైన ప్రశ్నకి సమాధానం ఈ రాత్రి నుండి ..అన్ని విషయాలు మాట్లాడుకుందాం.’ అంటూ స్ట్రీమింగ్‌ కు సంబంధించిన అప్‌డేట్స్‌ను షేర్‌ చేసింది ఆహా. ఎవరూ ఊహించని ట్విస్టులు, స‌స్పెన్స్, డ్రామా, రొమాన్స్.. ఇలా అన్నీ అంశాలు సినిమాలో ఉన్నట్లు ట్రైలర్‌ చూస్తేనే అర్ధమైంది. మూఢనమ్మకాలపై ఆసక్తికరంగా రూపొందిన ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

మదన పల్లె సామూహిక ఆత్మహత్యల నేపథ్యంలో..

ఇక ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌ సినిమా కథ విషయానికొస్తే.. కారు ప్రమాదంలో బళ్లారి నీలకంఠం (నరేశ్) మరణిస్తాడు. అయితే ఎలాగైనా ఆయనను తిరిగి బతికించాలని హెబ్బా పటేల్‌తో సహా ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించుకుంటారు. ఆయనను ప్రేమించే వారు బలంగా కోరుకుని ప్రాణ త్యాగం చేస్తే మళ్లీ ఆయన తిరిగి వచ్చే అవకాశముందని సామూహికంగా బలవన్మరణానికి రెడీ అవుతారు. అయితే హెబ్బాను ప్రేమించిన రామ్‌ కార్తీక్‌ దీనిని అంగీకరించడు. చివరకు అతనిని కూడా నమ్మిస్తారు హెబ్బా కుటుంబ సభ్యులు. మరి వాళ్లను అలా ఉసిగొల్పిందెవరు? ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవాలంటే ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌ సినిమాను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ది గ్రేట్ ఇండియా సూసైడ్‌ ట్రైలర్

ప్రధాన పాత్రలో హెబ్బా పటేల్, రామ్ కార్తీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.