మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా నటించిన చిత్రం ‘భీమా’. ఏ.హర్ష తెరకెక్కించిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లు కనిపించారు. పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ ఆసక్తిగా ఉండడంతో మొదట్లో భీమా సినిమాపై బాగానే బజ్ వచ్చింది. అందుకు తగ్గట్టే మార్చి 8న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైంది. అయితే అభిమానుల అంచనాలు అందుకోవడంలో భీమా విఫలమైంది. సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో ఆశించిన మేర కలెక్షన్లు రాలేదు. అయితే ఎప్పటిలాగే గోపిచంద్ తన ట్రేడ్ మార్క్ యాక్టింగ్, యాక్షన్ తో అభిమానులను అలరించాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన భీమా సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. గోపిచంద్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఏప్రిల్ 25వ తేదీ నుంచి భీమా సినిమా స్ట్రీమింగ్‍కు రానుంది. తాజాగా ఈ విషయాన్నిడిస్నీప్లస్ హాట్‍స్టార్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘ సర్ ప్రైజ్.. సర్ ప్రైజ్.. ఉగాది సందర్భంగా సర్‌ప్రైజ్.. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్ భీమాను ఏప్రిల్ 25వ తేదీన మీ స్క్రీన్‍లపైకి తీసుకొస్తున్నాం’ అని డిస్నీ ప్లస్ హాట్‍స్టార్ ట్వీట్ చేసింది. దీనికి ఒక వీడియోను కూడా జత చేసిందిజ
భీమా చిత్రంలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. మరో రోల్‍లో కూడా కనిపించి అభిమానులను అలరించారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్, శుభలేఖ సుధాకర్, రఘుబాబు, నాజర్, నరేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. మరి థియేటర్లలో భీమా సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి..
Surprise surprise!
Bringing the action-packed, thrilling entertainer, #Bhimaa to your screens on April 25th!#BhimaaonHotstar@YoursGopichand @priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha@KKRadhamohan @RaviBasrur@SriSathyaSaiArt pic.twitter.com/9wIjhzLigr
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 9, 2024
Right away from the sets..)#BHIMAA in cinemas now! pic.twitter.com/ms0srSn5zV
— Gopichand (@YoursGopichand) March 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.