Game of Thrones OTT: తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ సిరీస్‌.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

|

Nov 07, 2023 | 7:56 PM

ప్రస్తుతం వరల్డ్ వైడ్‌ గా కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌ ఎలా సక్సెస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే ఓటీటీలు రాకముందే ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ టీవీ సిరీస్ గా పేరు తెచ్చుకుంది 'గేమ్ ఆఫ్ థ్రోన్స్. 2011లో ప్రారంభమైన ఈ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇండియాలోనూ ఈ సూపర్ సిరీస్‌కు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉన్నారు.

Game of Thrones OTT: తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ సిరీస్‌.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Game Of Thrones Series
Follow us on

ప్రస్తుతం వరల్డ్ వైడ్‌ గా కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌ ఎలా సక్సెస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే ఓటీటీలు రాకముందే ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ టీవీ సిరీస్ గా పేరు తెచ్చుకుంది ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్. 2011లో ప్రారంభమైన ఈ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇండియాలోనూ ఈ సూపర్ సిరీస్‌కు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉన్నారు. మన దర్శక దిగ్గజం రాజమౌళి వంటి ప్రముఖులకు కూడా గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ ఫేవరెట్‌ సిరీస్‌గా నిలిచింది. ఫాంటసీ, యాక్షన్ సీన్స్, లవ్ ట్రాక్స్, రొమాన్స్‌ గ్రాఫిక్స్‌, మోసం, డైలాగ్స్ వంటి అన్ని అంశాలు కలగలిపిన ఈ యాక్షన్‌ అడ్వెంచెరస్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఇప్పుడు తెలుగులోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జియో సినిమాలో గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లోనూ ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఇది మన తెలుగు ఆడియెన్స్‌కు గుడ్‌ న్యూస్‌ అని చెప్పవచ్చు. అయితే రీజనల్‌ భాషల్లో గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ సిరీస్‌ చూడాలంటే జియో సినిమా సబ్‌ స్క్రిప్షన్ తప్పనిసరి.

గేమ్ ఆఫ్‌ థ్రోన్స్‌ వెబ్‌ సిరీస్‌ లో కిట్ హరింగ్టన్, ఎమిలా క్లార్క్, సోఫీ టర్నర్, మైసీ విలియమ్స్, లీనా హెడీ, పీటర్ డింక్లేజ్, సీన్ బీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వెస్టెరోస్, ఎస్సోస్ అన్న కల్పిత ఖండాల్లో రెండు రాజ్యాల మధ్య జరిగే పోరాటాన్ని ఇందులో చూపించారు. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్స్‌ ఉన్నాయి. మరి ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ తెలుగులో చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా జియో సినిమా సబ్‌ స్క్రిప్షన్ తీసుకోండి మరి.

ఇవి కూడా చదవండి

ఎనిమిది ఎపిసోడ్లతో ఆసక్తిరంగా..

జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.