OTT Movie: ప్రేమికుల జీవితంలోకి ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ ఎంటర్‌ అయితే.. ఓటీటీలో పుష్ప విలన్ సస్పెన్స్ థ్రిల్లర్

ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ సీరియల్ కిల్లర్ గా నటించడం విశేషం. వీరితో పాటు ద‌ర్శ‌న రాజేంద్ర‌న్‌, సౌబీన్ షాహిర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. అనుక్షణం ఉత్కంఠ కలిగించే ఈ మూవీ రన్ టైమ్ కూడా చాలా తక్కువే.

OTT Movie: ప్రేమికుల జీవితంలోకి ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ ఎంటర్‌ అయితే.. ఓటీటీలో పుష్ప విలన్ సస్పెన్స్ థ్రిల్లర్
OTT Movie

Updated on: May 07, 2025 | 10:25 AM

పుష్ప సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైపోయాడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. ఈ ట్యాలెంటెడ్ నటుడు గతంలో కొన్ని సినిమాల్లో నెగెటివ్ రోల్స్ పోషించి ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. అందులో ఈ మూవీ కూడా ఒకటి. మిస్టరీ థ్రిల్లర్ జానర్ కు చెందిన మూవీలో సౌబీన్ షాహిర్‌, ద‌ర్శ‌నా ర‌జేంద్ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. సినిమా కథ మొత్తం వీరి ముగ్గురు చుట్టే తిరుగుతుంది. ఒక ప్రేమ‌జంట జీవితంలోకి ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ ఎంటర్‌ అయితే ఎలా ఉంటుందో ఈ చిత్రం లో ఉత్కంఠగా చూపించారు. వ్యాపారవేత్త అయిన అలెక్స్‌ (సౌబిన్‌ షాహిర్‌) అప్పుడప్పుడు నవలలు రాస్తుంటాడు. ఓ వారాంతంలో.. తాను ప్రేమించిన అమ్మాయి అర్చన పిళ్లై (దర్శనా రాజేంద్రన్‌)తో కలిసి వెకేషన్ ప్లాన్‌ చేస్తాడు. అలా ఆ ఇద్దరు విహార యాత్రకు వెళుతుండగా మార్గ మధ్యలో కారు బ్రేక్‌డౌన్‌ అవుతుంది. మరోవైపు వర్షం కూడా ప్రారంభమవుతుంది. దీంతో ఇద్దరూ సమీపంలోని ఓ ఇంటికి వెళతారు. ఇంటి యజమాని ఉన్ని (ఫహాద్‌ ఫాజిల్‌) వారికి ఆశ్రయం ఇస్తాడు. అయితే ఓ నవలలో అలెక్స్ రాసినట్టే ఆ ఇంట్లో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అదే సమయంలో అలెక్స్‌ గురించి అర్చనకు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ ఇంట్లో ఓ మృత దేహం కూడా బయట పడుతుంది. మరి ఆ మర్డర్‌ చేసింది ఉన్నినా? అలెక్సా? అర్చనకు తెలిసిన నిజాలేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే, మీరు తప్పకుండా చూడాల్సిందే ఫహద్ ఫాజిల్ సినిమా చూడాల్సిందే.

ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సినిమా పేరు ఇరుల్. తెలుగులో అపరాధిగా మరికొన్ని గంటల్లో (మే08) ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కేవ‌లం 30 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్‌ను పూర్తిచేసి ఓటీటీలో విడుదల చేశారు. ప్రేక్షకులను ప్రతి క్షణం సస్పెన్స్‌కు గురిచేసే ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కరోనా టైమ్ లో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సుమారు నాలుగేళ్ల తర్వాత ఈమూవీ తెలుగు వెర్షన్ అందుబాటులోకి రానుంది. ఈ మూవీకి న‌సీఫ్ యూస‌ఫ్ ఇజుద్దీన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సునీల్ యాద‌వ్ క‌థ‌ను అందించాడు. ఈ సినిమా ర‌న్‌టైమ్ కేవలం 91 నిమిషాలే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇవి కూడా చదవండి

మరికొన్ని గంటల్లో ఆహాలో అపరాధి స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.