OTT: కనుమరుగైన తారలకు దారి చూపిస్తోన్న ఓటీటీలు.. వీళ్ళు మళ్లీ క్లిక్ అవుతారా..?

|

Jul 30, 2022 | 10:55 AM

ఒకప్పుడు రాణించిన తారలందరూ ఇప్పుడు తిరిగి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు మంచి ఫామ్లో ఉన్న హీరోలు, హీరోయిన్లు మెల్లగా ఫెడ్ అవుట్ అయిపోయారు.

OTT: కనుమరుగైన తారలకు దారి చూపిస్తోన్న ఓటీటీలు.. వీళ్ళు మళ్లీ క్లిక్ అవుతారా..?
Ott
Follow us on

ఒకప్పుడు రాణించిన తారలందరూ ఇప్పుడు తిరిగి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు మంచి ఫామ్లో ఉన్న హీరోలు, హీరోయిన్లు మెల్లగా ఫెడ్ అవుట్ అయిపోయారు. కొత్త అందాలు, కొత్త టాలెంట్ లు వస్తున్న తరుణంలో చాలా మంది కనుచూపు మేరలో కూడా కనపడకుండా వెళ్లిపోయారు. కొంతమందిని అయితే జనాలు పూర్తిగా మర్చిపోయారు కూడా.. అయితే చాలా మంది తిరిగి ఎంట్రీ ఇవ్వాలని ఛాన్స్ దొరికితే మరోసారి తమ సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే అవకాశాలు మాత్రం పలకరించడం లేదు. ఇటీవల ఓటీటీల హంగామా ఎక్కువ కావడంతో ఫేడ్ అవుట్ అయిన స్టార్స్ లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వెబ్ సిరీస్ లు వరదలా వస్తున్న నేపథ్యంలో ఓటీటీలు ఆ స్టార్స్ ను ఎంచుకుంటున్నారు. ఇలా వస్తున్న వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు వీరే..

హీరోయిన్ సదా ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయింది. జయం సినిమాతో పరిచయం అయిన సదా ఆతర్వాత తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసి పాపులారిటీ తెచ్చుకుంది. కానీ ఈ అమ్మడు ఎక్కువకాలం రాణించలేక పోయింది. మెల్లగా అమ్మడి కి నిమ అవకాశాలు తగ్గిపోయాయి. ఆ మధ్య పలు టీవీషోలో జేడ్జ్ గా కనిపించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా ఇండస్ట్రీ పరిచయం అయిన ఆర్యన్ రాజేష్ కూడా హీరోగా పలు సినిమాలో మెప్పించారు. అయితే ఆయన ఉన్నట్టుండి సినిమాలకు దూరం అయ్యారు. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా హిట్ అవలేదు. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తో మరోసారి తన అదృష్ఠంని పరీక్షించుకుంటున్నారు.

ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన వాళ్లలో సుశాంత్ ఒకరు. కరెంట్ కాళిదాస్ సినిమాతో హీరోగా పరిచయం అయిన సుశాంత్. కరెంట్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆతర్వాత వరుస గా సినిమాలు చేసిన అవి ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోయాయి. చివరిగా అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురం లో సినిమాలో సెకండ్ హీరోగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మా ఊరి నీళ్ల ట్యంక్ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే హీరోయిన్ లయ కూడా చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. ఈ మధ్య కాలంలో లయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. రకరకాల డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు లయ. మరి ఇలా ఫేడ్ అవుట్ అవుతున్న తారలు ఓటీటీ ద్వారా తిరిగ్గి క్లిక్ అవుతారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి