Sita Ramam OTT Release: మలయాళం సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తెలుగులో నేరుగా నటించిన చిత్రం సీతారామం(Sita Ramam). బాలీవుడ్ బ్యూటీ మృణాల్‌ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటించగా, రష్మిక మందాన (Rashmika Mandanna) కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఫీల్‌గుడ్ సినిమాలను హృద్యంగా తెరకెక్కించే హనురాఘవపూడి ఈ క్లాసిక్ లవ్‌స్టోరీని తీర్చిదిద్దాడు. సినిమాలో లీడ్ పెయిర్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ నటన, కెమిస్ట్రీకి మంచి ప్రశంసలు రాగా.. రష్మిక రోల్ మంచి సపోర్ట్ ఇచ్చింది. దీంతో ఈ ప్రేమకథను వీక్షించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ఇది కలెక్షన్ల రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబడుతోంది. దీంతో చిత్రబృందమంతా హ్యాపీమూడ్‌లో ఉంది. ఇదిలా ఉంటే సీతారామం చిత్రానికి సంబంధించిన ఓ మేజర్ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే ఓటీటీ రిలీజ్.
‘సీతారామం’ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. టైటిల్ క్రెడిట్స్ లో దీనిపై పూర్తిగా క్లారిటీ వచ్చింది. అయితే స్ట్రీమింగ్ ఎప్పుడనేది మాత్రం తెలియాల్సి ఉంది. సాధారణంగా విడుదలైన నాలుగు వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ చేసుకునేలా నిర్మాతలతో సంస్థలు ఒప్పందం చేసుకుంటున్నాయి. ఆ లెక్కన ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదటివారంలో సీతారామం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న నియమ నిబంధలనకు అనుగుణంగా 10 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాతో అక్కినేని సుమంత్.. లెఫ్ట్‌నెంట్ కల్నల్ విష్ణు శర్మ పాత్రలో కనిపించనున్నారు. ఆయన భార్యగా భూమిక చావ్లా నటించింది. అలాగే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఓ కీలక పాత్రలో నటించాడు. స్వప్న సినిమా బ్యానర్ లో వైజయంతీ మూవీస్‌పై అశ్వినీ దత్ సీతారామం చిత్రాన్ని నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన స్వరాలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.
Amazing public response for #SitaRamam ❤❤#SitaRamamInCinemas@dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @TharunBhasckerD @hanurpudi @AshwiniDuttCh @VyjayanthiFilms @Radhakrishnaen9 @homescreenent pic.twitter.com/s3oCR7velf
— Wayfarer Films (@DQsWayfarerFilm) August 6, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..