Chup Movie: ఓటీటీలో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్ సినిమా.. చుప్ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్..

|

Nov 28, 2022 | 8:15 PM

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా చుప్... రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్. ఈ మూవీ జీ5లో నవంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

Chup Movie: ఓటీటీలో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్ సినిమా.. చుప్ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్..
Chup
Follow us on

సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు మలయాళీ సూపర్ స్టా్ర్ దుల్కర్ సల్మాన్. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. డైరెక్టర్ హాను రాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీ దుల్కర్ సరసన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించింది. ఈ సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా చుప్… రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్. ఈ మూవీ జీ5లో నవంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతి లాల్ గ‌డా, గౌరి షిండే, రాకేష్ జున్‌జున్‌వాలా, హోప్ ప్రొడ‌క్ష‌న్స్ అనీల్ నాయుడు నిర్మించిన‌ ఈ చిత్రాన్ని ఆర్‌.బాల్కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో స‌న్నీడియోల్‌, శ్రేయా ధ‌న్వంత‌రి కీలకపాత్రల్లో న‌టించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ప్రీమియ‌ర్ అవుతుంది.

ఈ మూవీలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ప్రత్యేక పాత్ర‌లో న‌టించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. థియేట‌ర్స్‌లో స‌క్సెస్ అయిన త‌ర్వాత జీ 5లో ఆడియెన్స్‌ని అలరిస్తోంది చుప్ చిత్రం. 24 గంట‌ల్లో 30 మిలియ‌న్ వ్యూస్ రాబ‌ట్టుకోవ‌ట‌మే అందుకు సాక్ష్యం. గురుద‌త్‌కి నివాళిగా రూపొందించిన ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనే మూవీ సినిమా విమర్శకులను లక్ష్యంగా చేసుకున్న సైకోపాత్ కిల్లర్ కథాంశమే ఇది. సినీ విమర్శకుల నైతికతపై అనేక ప్రశ్నలను సంధించే థ్రిల్లర్ చిత్రమిది. కొందరి వ్యక్తుల అభిప్రాయాలపై యాక్టర్ భవిష్యత్తు నిర్ణయించబడుతుందా? మరోవైపు, కళ విమర్శించబడకుండా ఉనికిలో మరియు అభివృద్ధి చెందుతుందా? ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్ట్‌’ సినిమాలో నటీనటుల గొప్ప ప్రదర్శనలు, సినిమాటోగ్రఫీ వంటి సాంకేతిక అంశాలు ప్రేక్ష‌కుల‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టింది.

ఇవి కూడా చదవండి

అమిత్ త్రివేది, స్నేహా ఖాన్ వాల్కర్ అద్భుత‌మై ట్యూన్స్‌, బ్యాగ్రౌండ్‌లో వినిపించే SD బర్మన్ పాటలతో ఉన్న ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ మీడియా మరో కోణాన్ని ప్రపంచానికి వివరించింది. ఈ చిత్రం న‌వంబ‌ర్ 25 నుంచి జీ 5లో ప్ర‌సారం అవుతుంది. 190 దేశాల‌కు పైగా హిందీ, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం.. 5 భాష‌ల్లో ఈ సినిమా జీ 5లో అందుబాటులో ఉంటుంది.