Cinema : థియేటర్లలో ప్లాప్.. కట్ చేస్తే.. ఓటీటీని శాసిస్తున్న 2 గంటల సినిమా.. మనసులను హత్తుకునే క్లైమాక్స్..

ఈమధ్య కాలంలో ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. విభిన్న జానర్ చిత్రాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సంవత్సరం చాలా సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే హిట్ అయ్యాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన ఒక సినిమా విడుదలైన వెంటనే ఓటీటీలో సూపర్ హిట్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?

Cinema : థియేటర్లలో ప్లాప్.. కట్ చేస్తే.. ఓటీటీని శాసిస్తున్న 2 గంటల సినిమా.. మనసులను హత్తుకునే క్లైమాక్స్..
Cinema (4)

Updated on: Nov 03, 2025 | 7:38 AM

ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద విడుదలైన కొన్ని సినిమాలు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. మరికొన్ని చిత్రాలు ప్లా్ప్ అయ్యాయి. అయితే విడుదలకు ముందే మంచి హైప్ తెచ్చుకున్న ఓ సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు అదే సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. విధ్వంసక యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్న సినిమా మాత్రం కాస్త ప్రత్యేకం. ఈ మూవీ స్టోరీ నేరుగా అడియన్స్ హృదయాలను హత్తుకుంటుంది. తండ్రి కొడుకుల కలల చుట్టూ .. వారి సాధారణ జీవితం చుట్టూ తిరిగే కథ ఇది. అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

ఈ సినిమాలో ఒక కొడుకు తన తండ్రి కలలను నెరవేర్చాలని సంకల్పించుకుంటాడు. తన జీవితంలోకి వచ్చిన అమ్మాయి ప్రేమ అతడిని ఎలాంటి పరిస్థితులలోకి తీసుకెళ్లింది అనేది సినిమా. ఈ సినిమాలోని నటీనటుల నటన, బీజీఎమ్, భావోద్వేగ సన్నివేశాలు ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమా పేరు ఇడ్లీ కొట్టు. తమిళంలో ఇడ్లీ కథై పేరుతో తెరకెక్కించగా.. తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజ్ చేశారు. కోలీవుడ్ హీరో ధనుష్ కథ రాసి దర్శకత్వం వహించాడు. ఇందులో మురుగన్ అనే యువకుడు తన తండ్రి కలలకు విరూద్ధంగా గ్రామాన్ని వదిలి దుబాయ్ వెళ్లిపోతాడు. అక్కడే ఓ వ్యాపారి కూతురితో ప్రేమలో పడతాడు. పెళ్లి సమయంలో తన తండ్రి చనిపోవడంతో గ్రామానికి తిరిగి వస్తాడు. అప్పుడే తన తండ్రి కలలు కన్నట్లు గ్రామంలోనే ఇడ్లీ దుకాణాన్ని ప్రారంభిస్తాడు. అప్పుడే అతడి జీవితంలోకి మరో అమ్మాయి వస్తుంది. తర్వాత అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది సినిమా.

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

ఈ సినిమాలో ధనుష్, నిత్యా మీనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్ కిరణ్, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలోని క్లైమాక్స్ ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం భారతదేశంలో రూ. 50.42 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 71.77 కోట్లు సంపాదించింది. ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్‏మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?