టాలీవుడ్ యంగ్ హీరో, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. మన దేశంలో రూపొందిన మొదటి సూపర్ హీరో సినిమా ఇదే. చిన్న సినిమాగా సంక్రాంతికి రిలీజైన హనుమాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే హనుమాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు చాలా ఆలస్యమైంది. థియేటర్లలో రిలీజైన సుమారు 66 రోజుల తర్వాత కానీ ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి రాలేదు. అయితే ఎట్టకేలకు ఆదివారం (మార్చి 17) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో హనుమాన్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ రికార్డులు కొల్లగొడుతోంది. నేషనల్ వైడ్ గా టాప్ ట్రెండింగ్ లో ఉంటూ భారీ వ్యూస్ రాబడుతోంది. ఇదిలా ఉంటే సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిన హనుమాన్ సినిమాకు అందరూ కనెక్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా పిల్లలు హనుమాన్ వీఎఫ్ ఎక్స్, విజువల్స్ కు ఫిదా అయ్యారు.
ఈ నేపథ్యంలో ఓటీటీలో హనుమాన్ సినిమాను వీక్షించిన ఓ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. సినిమా ఇంటర్వెల్ సమయంలో వచ్చే కుస్తీ ఫైట్ సీన్ లో విలన్ హీరోను కొట్టి కింద పడేస్తాడు. ఆ సీన్ చూసిన చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. బోరున ఏడ్చేసింది. అయితే తిరిగి హీరో లేచాక చప్పట్లు కొడుతుంది. ఈదీనికి సంబంధించిన వీడియోను చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా స్పందించి రిప్లై కూడా ఇచ్చాడు. హనుమాన్ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో మెరవగా, వాన ఫేమ్ వినయ్ రాయ్ విలన్ గా అదరగొట్టాడు. వీరితో పాటు సముద్ర ఖని, వెన్నెల కిశోర్, జబర్దస్త్ శీను, తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు.
Awww 🥹🤗 https://t.co/HlczCf7Ewx
— Prasanth Varma (@PrasanthVarma) March 18, 2024
The most awaited movie HanuMan is now streaming on ZEE5. Subscribe and watch it now! 🍿 @PrasanthVarma @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets @tipsofficial @tipsmusicsouth @ThePVCU @RKDStudios #HanuMan #HanuManOnZEE5 pic.twitter.com/zRd0M4cEwR
— ZEE5 Telugu (@ZEE5Telugu) March 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి