Netflix: ఢిల్లీ హైకోర్టులో నెట్‌ఫ్లిక్స్‌కు చుక్కెదురు.. బాలుడి మర్డర్ డాక్యుమెంటరీ ప్రసారానికి బ్రేక్..

|

Aug 14, 2021 | 11:51 AM

Delhi High Court on Netflix: ఢిల్లీ హైకోర్టులో ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌కు చుక్కెదురైంది. బాలుడి మృతికి సంబంధించిన డాక్యుమెంటరీ ప్రసారం కేసులో

Netflix: ఢిల్లీ హైకోర్టులో నెట్‌ఫ్లిక్స్‌కు చుక్కెదురు.. బాలుడి మర్డర్ డాక్యుమెంటరీ ప్రసారానికి బ్రేక్..
Netflix
Follow us on

Delhi High Court on Netflix: ఢిల్లీ హైకోర్టులో ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌కు చుక్కెదురైంది. బాలుడి మృతికి సంబంధించిన డాక్యుమెంటరీ ప్రసారం కేసులో నెట్‌ఫ్లిక్స్‌కు ధర్మాసనం కీలక ఆదేశాలిచ్చింది. ఆగస్టు 6 విడుదల చేసిన డాక్యుమెంటరీని నిలిపివేయాలంటూ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌కు ఆదేశాలిచ్చింది. పాఠశాలకు సంబంధించిన అన్ని సన్నివేశాలను తొలగించిన తర్వాత.. డాక్యుమెంటరీని ప్రసారం చేయవచ్చంటూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. గురుగ్రామ్‌కు చెందిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ వాష్‌రూమ్‌లో 7 ఏళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. ఆ మరణం ఆధారంగా నెట్‌ఫ్లిక్స్.. పలు సంస్థల భాగస్వామ్యంతో ‘ఎ బిగ్ లిటిల్ మర్డర్’ అనే డాక్యుమెంటరీని రూపొందించి.. ఆగస్టు 6న లైవ్ స్ట్రీమింగ్‌లో విడుదల చేసింది.

అయితే.. ఆ డాక్యుమెంటరీలో తమ పాఠశాల పేరును ప్రస్తావిస్తున్నారని.. ఆ డాక్యుమెంటరీని నిలిపివేయాలంటూ ఇంటర్నేషనల్ స్కూల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా ఉండాలని ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్, భాగస్వామ్య సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. పాఠశాలకు సంబంధించిన అన్ని విషయాలను తొలగించిన తర్వాత ప్రదర్శనను ప్రసారం చేయవచ్చని కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు జస్టిస్ జయంత్ నాథ్ ధర్మాసనం పై విధంగా తీర్పునిచ్చింది.

అయితే.. పిల్లల మరణంపై డాక్యుమెంటరీని తీస్తున్నప్పటికీ.. అది ఎక్కువగా ప్రభావితం చేసేలా ఉండకూడదని తెలిపింది. సంబంధిత డాక్యుమెంటరీని స్ట్రీమ్ చేయవచ్చు.. కానీ పాఠశాల భవనం చిత్రీకరణ సమంజసం కాదని తెలిపారు. పాఠశాల విజువల్స్, ప్రస్తావన లాంటివి తీసివేయాలని పేర్కొంది. కాగా.. ఈ సంఘటన జనవరి 8, 2018లో జరిగింది.

Also Read:

Lovers Death: కారులోనే అగ్నికి ఆహుతైన ప్రేమజంట.. అసలేమైందంటే..?

Terrorist Arrested: జమ్మూకాశ్మీర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది అరెస్ట్‌.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..