OTT Movie: పూలు, పాల వ్యాపారులే టార్గెట్.. రియల్ స్టోరీతో తెరకెక్కిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..

ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలోనూ అందులోనూ తెలుగు వెర్షన్ లోనూ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

OTT Movie: పూలు, పాల వ్యాపారులే టార్గెట్.. రియల్ స్టోరీతో తెరకెక్కిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
OTT Movie

Updated on: Oct 11, 2025 | 6:57 PM

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు వెర్షన్ లేకపోయినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తోనే చాలా మంది మాలీవుడ్ సినిమాలను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ మధ్యన మలయాళంలో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ నే. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ కు ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. కేరళ రాజధాని త్రివేండ్రం చుట్టూ ఈ సిరీస్ కథ సాగుతుంది. ఈ సిటీలో నలుగురు యువకులు, మురికివాడ నుండి వచ్చిన ఒక చిన్న పిల్లవాడు ఉంటారు. ఆ ఊర్లో ఆలయ ఉత్సవం జరిపి తమ గౌరవాన్ని పెంచుకోవాలని ఈ గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. ఇదే క్రమంలో సిటీలో ఉండే పాలు, పూల మార్కెట్లను ఒక క్రిమినల్ గ్యాంగ్ కంట్రోల్ చేస్తుంటుంది. పూలతో ఫ్లవర్ కింగ్ అని పిలిపించుకునే ఓ వ్యక్తి నగరంలో ఘోరాలకు పాల్పడుతాడు. పూలు, పాలు వ్యాపారాలు చేసే వాళ్లను టార్గెట్ చేస్తారు. అలాంటి క్రిమినల్ గ్యాంగ్ తో నలుగురు యువకులకు వచ్చిన ప్రమాదమేంటి? చివరకు ఏమైందన్నదే ఈ సిరీస్ కథ.

వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ పేరు ది క్రోనికల్స్ ఆఫ్ ది ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్. కు క్రిషాంద్ తెరకెక్కించిన ఈ సిరీస్ లో ప్రముఖ నటి దర్శన రాజేంద్రన్ కీలక పాత్ర పోషించింది. అలాగే జగదీష్, ఇంద్రన్స్, విజయరాఘవన్, హకీం షా, దర్శన రాజేంద్రన్, సంజు శివరామ్, సచిన్, శాంతి బాలచంద్రన్, నిరంజ్ మణియన్ పిళ్లై, శ్రీనాథ్ బాబు, శంబు మీనన్, ప్రశాంత్ అలెక్స్, రాహుల్ రాజగోపాల్, విష్ణు అగస్త్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలులోనూ ఈ థ్రిల్లర్ సిరీస్ ను చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ది క్రోనికల్స్ ఆఫ్ ది ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి