ఇటీవల చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రాల్లో రైటర్ పద్మభూషణ్ ఒకటి. ఈ చిత్రంలో విలక్షణమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించారు. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆశీష్ విద్యార్థి, రోహిణి, టీనా శిల్పరాజ్ కీలకపాత్రలలో నటించారు. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో మరోసారి నటుడిగా ప్రశంసలు అందుకున్నారు హీరో సుహాస్. ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5 రైటర్ పద్మభూషణ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఉగాది కానుకగా మార్చి 22న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారట మేకర్స్. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్ రాలేదు. ) విజయవాడకి చెందిన ఓ మధ్య తరగతి కుర్రాడు పద్మభూషణ్ అలియాస్ భూషణ్ (సుహాస్).
ఓ గ్రంథాలయంలో అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పని చేస్తుంటాడు. ఎప్పటికైనా రైటర్ పద్మభూషణ్ అనిపించుకోవాలనేది అతని కల. అందుకోసమని ఇంట్లో వాళ్లకి తెలియకుండా లక్షలు అప్పు చేసి తొలి అడుగు పేరుతో ఓ బుక్ రాస్తాడు. కానీ, పాఠకులతో ఆ బుక్‌ని చదివించడానికి పడరాని పాట్లు పడుతుంటాడు. ఆ తర్వాత పద్మభూషణ్ జీవితంలో ఎదురైన సంఘటనలే రైటర్ పద్మభూషణ్.
Xclusive? #Suhas ‘s #WriterPadmabhushan post theatrical digital streaming rights acquired by #Zee5
..
For more faster updates on OTT Info do follow @celerupdates pic.twitter.com/UyJdeaYCc3— Celer Updates (@celerottupdates) February 4, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.