Oppenheimer OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలో 7 ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న ఓపెన్ హైమర్.. ఎక్కడ చూడొచ్చంటే?

ఈ ఏడాది ఆస్కార్స్‌లో ఏడు అవార్డులను గెలుచుకున్న ' ఓపెన్‌హైమర్ ' చిత్రం మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది.  ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఈరోజు అర్ధరాత్రి నుంచే ఓటీటీలో ప్రత్యక్షం కానుంది

Oppenheimer OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలో 7 ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న ఓపెన్ హైమర్.. ఎక్కడ చూడొచ్చంటే?
Oppenheimer
Follow us

|

Updated on: Mar 20, 2024 | 4:40 PM

ఈ ఏడాది ఆస్కార్స్‌లో ఏడు అవార్డులను గెలుచుకున్న ‘ ఓపెన్‌హైమర్ ‘ చిత్రం మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది.  ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఈరోజు అర్ధరాత్రి నుంచే ఓటీటీలో ప్రత్యక్షం కానుంది. ఇందులో కిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్, ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, ఫ్లోరెన్స్ పగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో అణు బాంబును రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు క్రిస్టోఫర్ నోలన్. ఇందులో ఓపెన్‌హైమర్‌గా సిలియన్ మర్ఫీ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. తన నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఏకంగా ఆస్కార్ పురస్కారం కూడా అందుకున్నాడు. ఈ సినిమా గతేడాది జూన్‌లో థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక 96వ అకాడమీ అవార్డులు ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాలతో సహా మొత్తం ఏడు ఆస్కార్ అవార్డులు ఓపెన్ హైమర్ కు వచ్చాయి.

అంతకు ముందు గోల్డెన్ గ్లోబ్స్‌లో బెస్ట్ డ్రామా మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ మోషన్ పిక్చర్, బెస్ట్ యాక్టర్ డ్రామా ఇన్ ఎ మోషన్ పిక్చర్‌తో సహా 8 అవార్డులను గెలుచుకుంది. అలాగే BAFTA ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితో సహా ఏడు పురస్కారాలు సాధించింది. అదనంగా ఎనిమిది విభాగాలలో 2024 క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమాలో క్రిస్టోఫర్ నోలన్ కథాంశం. ఫ్లోరెన్స్ పగ్, రాబర్ట్ డౌనీ జూనియర్, గ్యారీ ఓల్డ్‌మన్, రామి మాలెక్, కెన్నెత్ బ్రనాగ్ అభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

ఇవి కూడా చదవండి

జియో సినిమాలో స్ట్రీమింగ్..

కాగా ‘ఓపెన్‌హైమర్’ సినిమా గతంలో అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలైంది. కానీ అక్కడ ఉచితంగా వీక్షించే అవకాశం లేదు. అద్దె ప్రాతిపదికన అంటే డబ్బులు చెల్లించి చూడాల్సిందే. పైగా కేవలం ఇంగ్లిష్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ జియో సినిమా లో ఓపెన్ హైమర్ స్ట్రీమింగ్ కానుంది. ఇక్కడ ఉచితంగా చూసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కేవలం ఇంగ్లిష్, హిందీ వెర్షన్లు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది జియో సినిమా. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.75 వేలకు చేరువలో బంగారం ధరలు..దిగి రాని వెండి
రూ.75 వేలకు చేరువలో బంగారం ధరలు..దిగి రాని వెండి
12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు)
12 రాశులకు వార ఫలాలు (ఏప్రిల్ 28 నుంచి మే 4, 2024 వరకు)
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో