ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం ఓపెన్ హైమర్. అణుబాంబును కనిపెట్టిన శాస్త్రవేత్త ఓపెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ ఏడాది జులై 21న థియేటర్లలో విడుదలైన ఓపెన్ హైమర్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది హాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఓపెన్ హైమర్ రికార్డు సృష్టించింది. భారతదేశంలోనూ ఈ హాలీవుడ్ మూవీకి భారీ కలెక్షన్లు వచ్చాయి. అదే సమయంలో ఇండియాలో ఈ సూపర్ హిట్ సినిమాపై విమర్శలు వచ్చాయి. సినిమాలో భగవద్గీతను కించ పరిచే సన్నివేశాలున్నాయంటూ పలువురు ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన ఓపెన్ హైమర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కాగా గురువారం (నవంబర్ 09) కొన్ని పైరసీ సైట్స్‌లో ఓపెన్ హైమర్ సినిమా హెచ్ డీ వెర్షన్ ప్రింట్ దర్శనమివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. అందుకే అధికారికంగా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఓపెన్ హైమర్ సినిమాలో సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్, మాట్ డామన్ కీలక పాత్రలు పోషించారు. అణుబాంబును కనిపెట్టడంలో ఓపెన్‌హైమర్ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, అతనికి ఎదురైన ఒత్తిడులను ఈ సినిమాలో చక్కగా చూపించారు క్రిస్టోఫర్ నోలన్. అలాగే సిలియన్ మర్ఫీ నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇంగ్లిష్ తో పాటు తెలుగులో కూడా ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందా? లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఓటీటీ వెర్షన్ కచ్చితంగా సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. మరి థియేటర్లలో ఓపెన్ హైమర్ సినిమాను మిస్ అయ్యారా? ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
నవంబర్ 21 నుంచి అందుబాటులోకి..
Oppenheimer is yours to own on 4K, Blu-ray™, and Digital November 21. Christopher Nolan’s global blockbuster premieres at home with over 3 hours of special features. pic.twitter.com/qUJRCwPoUC
— Oppenheimer (@OppenheimerFilm) October 17, 2023
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..
Nolan’s MasterPiece #Oppenheimer will release on @PrimeVideoIN on November 21
The film is about the biography of the inventor of #AtomBomb pic.twitter.com/J8ZMujImgm
— OTT Updates Movies (@OTTUpdatesinfo) November 9, 2023