AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhola Shankar OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘భోళాశంకర్‌’.. మెగాస్టార్‌ సినిమాను ఎందులో చూడొచ్చంటే?

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ సినిమా భోళాశంకర్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ మెగా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం (సెప్టెంబర్‌ 15) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది. మెహర్‌ రమేశ్‌ తెరకెక్కించిన భోళాశంకర్‌ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. మహానటి కీర్తిసురేష్ మెగాస్టార్ చెల్లెలిగా సందడి చేసింది. యంగ్ హీరో అక్కినేని సుశాంత్‌ మరో కీలక పాత్రలో మెరిశాడు.

Bhola Shankar OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'భోళాశంకర్‌'.. మెగాస్టార్‌ సినిమాను ఎందులో చూడొచ్చంటే?
Bhola Shankar Movie
Basha Shek
|

Updated on: Sep 15, 2023 | 12:45 PM

Share

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన లేటెస్ట్‌ సినిమా భోళాశంకర్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ మెగా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం (సెప్టెంబర్‌ 15) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది. మెహర్‌ రమేశ్‌ తెరకెక్కించిన భోళాశంకర్‌ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. మహానటి కీర్తిసురేష్ మెగాస్టార్ చెల్లెలిగా సందడి చేసింది. యంగ్ హీరో అక్కినేని సుశాంత్‌ మరో కీలక పాత్రలో మెరిశాడు. భారీ అంచనాలతో ఆగస్టు 11న విడుదలైన భోళాశంకర్‌ ఆడియెన్స్‌ని నిరాశపర్చింది. మొదటి షో నుంచే నెగెటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద మెగాస్టార్‌ సినిమా చతికిలపడింది. వసూళ్ల పరంగానూ నిరాశపర్చింది. అయితే ఎప్పటిలాగే తన స్టైల్‌, డ్యాన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించారు. ముఖ్‌యంగా పవన్‌ మేనరిజమ్స్‌తో అభిమానులను అలరించే ప్రయత్నం చేశారు. సుమారు రూ.100 కోట్లకు పైగా తెరకెక్కిన భోళాశంకర్‌ ఓ మోస్తరు వసూళ్లతో మాత్రమే సరిపెట్టుకుంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని భోళాశంకర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. థియేటర్‌ రిలీజుకు ముందే భారీ ధర వెచ్చించి మరీ చిరంజీవి సినిమాను కొనుగోలు చేసింది సదరు ఓటీటీ సంస్థ. ఈ క్రమంలో ముందస్తు ఒప్పందం ప్రకారం శుక్రవారం నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో భోళాశంకర్‌ అందుబాటులో ఉంది.

కాగా తమిళంలో సూపర్ హిట్ అయిన అజిత్‌ వేదాళం చిత్రానికి రీమేక్ గా భోళా శంకర్‌ సినిమాను తెరకెక్కించారు. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీలో ఇందులో శ్రీముఖి, రష్మీ గౌతమ్‌, మురళీ శర్మ, రఘుబాబు, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి, హైపర్ ఆది, గెటప్ శీను తదితరులు కూడా వివిధ పాత్రల్లో మెరిశారు. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్‌ స్వరాలు స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో భోళాశంకర్‌ సినిమాను మిస్‌ అయ్యారా? అయితే ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి. భోళాశంకర్‌ నిరాశపర్చడంతో తన తర్వాతి సినిమాల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోనున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన బింబిసార డైరెక్టర్‌ మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో ఓ సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో తన కూతురు సుస్మిత కొణిదెల ప్రొడక్షన్‌ బ్యానర్‌లోనూ ఓ ప్రాజెక్టుకు అంగీకరించారు. త్వరలోనే ఈ మెగా సినిమాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

చిరంజీవి ఫ్యాన్స్ రియాక్షన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!