
డిజిటల్ ప్రపంచంలో అనేక హిట్ చిత్రాలతోపాటు.. ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించే షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది ఆహా ఓటీటీ. ఇప్పటివరకు తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషలలో మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలను సైతం తెలుగు అడియన్స్ ముందుకు తీసుకువచ్చింది. అలాగే సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ జానర్ వెబ్ సిరీస్ లతో జనాలను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు వీటితోపాటు చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సైతం మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేస్తున్న ఈ షో ఇప్పటివరకు నాలుగు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు కొత్త సీజన్ స్టార్ట్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఫన్, ఫుడ్, ఎంటర్ టైన్ మెంట్ తో సాగే ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 5’ లో ఐదు జంటలు ప్రేరణ – కావ్య, యాదమ్మ రాజు – దీపికా రంగరాజు, అఖిల్ సార్థక్ – మానస్, పాండు – యష్మి గౌడ, టేస్టీ తేజ – సౌందర్య తమ సరదా మాటలతో రుచికరమైన వంటలతో పోటీ పడబోతున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి 7 గంటలకు ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 5’ ఫస్ట్ ఎపిసోడ్ ‘స్వీట్ అండ్ సాల్ట్’ థీమ్ తో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు, ఆహాలో ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 5’ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉండనున్నట్లు ఆహా తెలిపింది.
ఇందులో సుమతోపాటు నటుడు జీవన్ కుమార్ అలరించనున్నారు. ఈ షోలో ఐదు జంటలు ప్రేరణ – కావ్య, యాదమ్మ రాజు – దీపికా రంగరాజు, అఖిల్ సార్థక్ – మానస్, పాండు – యష్మి గౌడ, టేస్టీ తేజ – సౌందర్య తమ రుచికరమైన వంటకాలను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలై గ్లింప్స్ ఆకట్టుకుంటుంది.
New season, new menu, same madness 😄
This promo is just the starter bite,
The real entertainment recipe gets plated on Nov 20 on aha.#ChefmantraprojectkS5onaha #CMPKS5onaha@ahavideoin @ItsSumaKanakalahttps://t.co/LfrF7zfQVL pic.twitter.com/4YF4B7UBq8— ahavideoin (@ahavideoIN) November 17, 2025
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..