బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్, మునాల్ థాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం “తూఫాన్”. ఈ సినిమా జూలై 16న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే గత వారం రోజుల్లో విడుదల కావాల్సిన ఈ సినిమాకు సోషల్ మీడియా ద్వారా నిరసన సేగ తాకింది. ఈ మూవీని చూడొద్దంటూ రిక్వెస్టులు పెడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో గత రాత్రి చెలరేగిన దుమారం ఇంకా నడుస్తూనే వస్తోంది. అయితే ఈ సినిమాలో ఫర్హాన్ ఒక గ్యాంగ్ స్టర్ పాత్ర. తన ప్రియురాలు మునాల్ ప్రోత్సాహంతో బాక్సింగ్ ఛాంపియన్‌గా మారతాడు. అయితే ఇందులో ఫర్హాన్ క్యారెక్టర్ పేరు అజిజ్ అలీ.. మ్రునాల్ పాత్ర పేరు డాక్టర్ పూజా షా.
No Doubt ?
Say loudly#BoycottToofaan #BoycottToofaan
Retweet and make these trend on ? pic.twitter.com/DftRZ7r2xm— OMKAR GAWARE1607 (@gaware1607) July 10, 2021
ఈ సినిమాకు ఇప్పుడు ఈ పేర్లే పెద్ద చిక్కుగా మారాయి. మతాంతర కథలను ప్రోత్సహించకూడదని.. ఇది సంప్రదాయానికి విరుద్ధమని కొందరు వాదిస్తున్నారు. అలాగే గతంలో సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా ఫర్హాన్ నిరసనల్లో పాల్గోన్నాడు. దీంతో కొందరు ఫర్హాన్ పై తీవ్ర కోపం పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను చూడొద్దంటూ వ్యతిరేక పోస్టులు పెడుతూ.. రివెంజ్ తీర్చుకుంటున్నట్లుగా బాయ్ కాట్ ట్రెండ్‌లో చేతులు కలుపుతున్నారు. భాగ్ మిల్కా భాగ్ సినిమా తర్వాత తుఫాన్ మూవీ కోసం ఫర్హాన్ ఎక్కువగానే కష్టపడ్డట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించగా.. విలక్షణ నటుడు పరేష్ రావెల్, ఫర్హాన్‌కు కోచ్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ట్వీట్స్..
Support this trend by
tweeting and retweeting#BoycottToofaan@beingarun28 pic.twitter.com/7lahTeXr8C
— पांडेय जी ?TTS + प्रशासक समिति? (@Bitan_Pandey) July 10, 2021
“Roses are Red
Violets are Blue
Let’s boycott Toofaan
Me and you” #BoycottToofaan
FastTrack SSR Murder Case pic.twitter.com/u9c7SH4god— Varsha Pathiyampattu ?? (@TherealVarsha) July 10, 2021
Toofaan Movie Is against Our Culture .
It’s Time To #BoycottToofaan
— Sadhvi Prachi (@Sadhvi_prachi) July 10, 2021
Kudi Yedamaithe : ఇలా ఉంటే మనల్ని ఎవరు ప్రశ్నించరు.. ఆసక్తికరంగా అమలా పాల్ ఇంట్రడ్యూసింగ్ వీడియో..