Bootcut Balaraju OTT: ఓటీటీలోకి వచ్చేసిన బిగ్‌ బాస్‌ సొహైల్‌ బూట్‌కట్‌ బాలరాజు.. ఎక్కడ చూడొచ్చంటే?

|

Feb 26, 2024 | 9:50 PM

బూట్ కట్ బాలరాజులో హీరోగా నటించడమే కాకుండా సినిమా నిర్మాణ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నాడు సోహైల్. అందుకు తగ్గట్టుగానే గట్టిగా ప్రమోషన్లు కూడా నిర్వహించాడు. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన బూట్‌ కట్‌ బాలరాజు ఆడియెన్స్ ను బాగానే నవ్వించింది. బాక్సాఫీస్‌ వద్ద ఓ మోస్తరుగానే వసూళ్లు రాబట్టింది.

Bootcut Balaraju OTT: ఓటీటీలోకి వచ్చేసిన బిగ్‌ బాస్‌ సొహైల్‌ బూట్‌కట్‌ బాలరాజు.. ఎక్కడ చూడొచ్చంటే?
Bootcut Balaraju Movie
Follow us on

బిగ్‌ బాస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సయ్యద్‌ సోహైల్‌ ర్యాన్ కూడా ఒకరు. ఇప్పుడు వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇదే కోవలో సయ్యద్ సొహైల్ నటించిన మరో ఫన్ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బూట్ కట్ బాలరాజు. శ్రీ కోనేటి తెరకెక్కించిన ఈ మూవీలో మేఘ లేఖ కథానాయికగా నటించింది. వీరితో పాటు సునీల్, సిరి హన్మంతు, ఇంద్రజ, ముక్కు అవినాష్‌ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. బూట్ కట్ బాలరాజులో హీరోగా నటించడమే కాకుండా సినిమా నిర్మాణ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నాడు సోహైల్. అందుకు తగ్గట్టుగానే గట్టిగా ప్రమోషన్లు కూడా నిర్వహించాడు. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన బూట్‌ కట్‌ బాలరాజు ఆడియెన్స్ ను బాగానే నవ్వించింది. బాక్సాఫీస్‌ వద్ద ఓ మోస్తరుగానే వసూళ్లు రాబట్టింది. అయితే తాను ఆశించినంత రీతిలో రెస్పాన్స్ రావడంతో సోహైల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజి కమాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మొత్తానికి థియేటర్లలో యావరేజ్ గా నిలిచింది బూట్ కట్ బాలరాజు. ఇప్పుడీ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఓటీటీలోకి వచ్చేసింది.

 

ఇవి కూడా చదవండి

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సోహైల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26 నుంచి బూట్ కట్‌ బాలరాజు సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌ కు తీసుకురానున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది ఆహా. అందుకు తగ్గట్టుగానే చెప్పిన సమయానికే అంటే సోమవారం (ఫిబ్రవరి 26) సాయంత్రం 6 గంటల నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేశాడు బూట్ కట్ బాలరాజు. ‘బూట్ కట్ బాలరాజుకే మన ఓటు’ అంటూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఆహా.

 

బూట్‌ కట్‌ బాలరాజు సినిమాను గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్‌పై స్వయంగా హీరో సోహైల్‌ స్వయంగా నిర్మించడం విశేషం. పేద, ధనిక అంతరాలకు కాస్త కామెడీ టచ్‌ ఇచ్చి ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్‌ శ్రీ కోనేటి. మరి థియేటర్లలో ఆడియెన్స్ ను నవ్వించిన బూట్ కట్ బాలరాజు ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.

 

ఆహాలో స్ట్రీమింగ్..

బూట్‌కట్‌ బాలరాజు ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.