Venkatesh: సినిమాల్లోకి వెంకటేష్ కొడుకు.. వెంకీమామ ఏమన్నారంటే..

|

Dec 26, 2024 | 7:00 PM

విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితమే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు వెంకటేశ్.

Venkatesh: సినిమాల్లోకి వెంకటేష్ కొడుకు.. వెంకీమామ ఏమన్నారంటే..
Venkatesh, Balakrishna
Follow us on

ఈ ఏడాది ప్రారంభంలో సైంధవ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేశ్. హిట్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ తర్వాత వెంకీమామ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాము. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ముందు నుంచి క్యూరియాసిటీ నెలకొంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్.

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి ఇద్దరూ కలిసి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఇక చాలా కాలం తర్వాత బాలయ్య, వెంకటేశ్ ఒకే స్టేజ్ పై కనిపించడంతో ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. వెంకీమామను తనదైన స్టైల్లో ప్రశ్నలు అడిగి నవ్వులు పూయించారు బాలయ్య. ఈ క్రమంలోనే వెంకీమామ కొడుకు గురించి సైతం ఆరా తీశారు. తన కొడుకు వయసు 20 సంవత్సరాలు అని.. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు వెంకటేశ్.

తన కొడుకు అర్జున్ చాలా నిదానం అని అన్నాడు. అయితే అర్జున్ సినిమాల్లోకి వస్తాడా ? అని ప్రశ్నించాడు బాలయ్య. ఇక తన కొడుకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి వెంకటేశ్ ఏం చెప్పారో తెలియాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే ఇదే షోలో తన మేనల్లుడు నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. చైతూను హగ్ చేసుకుంటే తెలియని ఆనందం కలుగుతుందని చెప్పారు వెంకటేశ్. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 27న రాత్రి 7 గంటలకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.