నట సింహ నందమూరి బాలకృష్ణ హౌస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ గురించి ఎంత చెప్పిన తక్కువే. దేశంలోనే టాప్ టాక్ షోగా నిలిచింది. నటసింహం తనదైన కామెడీ టైమింగ్ తో గెస్ట్ లను ఆటపట్టిస్తున్నారు. ఆహా డిజిటల్ ప్లాట్ ఫాంపై హోస్ట్‌గా రాణిస్తున్నారు బాలయ్య. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 1 భారీ విజయాన్ని అందుకుంది. తనదైన కామెడీ పంచులు.. ప్రాసలతో అతిథులతో ఆడియన్స్ కు కావాల్సిన సమాధానాలను సున్నితంగా రాబడుతున్నారు. తనదైన స్టైల్‌తో యాంకరింగ్ కు సరికొత్తదనాన్ని తీసుకువచ్చారు బాలకృష్ణ. ఇటీవల ప్రారంభమైన సీజన్ 2 కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. యంగ్ హీరోస్ తో కూడా తన కామెడీతో అలరిస్తున్నారు. సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, శర్వానంద్, అడవి శేష్ లను ఆటాడుకున్నారు బాలయ్య. అలాగే సీనియర్ రాజకీయ ప్రముఖులను కూడా గెస్ట్ లుగా పిలిచి తికమక పెట్టారు బాలకృష్ణ.
ఇక త్వరలో ఈ షో కు గెస్ట్ లుగా ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే సీనియర్ హీరోయిన్ రాధికా అన్ స్టాపబుల్ లో సందడి చేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరో ఇద్దరు సీనియర్ భామలు కూడా ఈ షో కు రానున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా కె. రాఘవేంద్రరావు డి. సురేష్ బాబు అల్లు అరవింద్ ఏ. కోదండరామిరెడ్డిలకు సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్ ని డిసెంబర్ 2 శుక్రవారం రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ అయ్యింది.
వీరి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గోపీచంద్ హాజరు కానున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత సీనియర్ భామలు జయసుధ, జయప్రద బాలయ్య షోకు హాజరుకానున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ వార్తలపై క్లారిటీ రానుంది. ఏది ఏమైనా బాలయ్య షోకు రోజు రోజుకు క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోతోంది.