నందమూరి బాలకృష్ణ నటించిన ఐకానిక్ చిత్రాల్లో ఆదిత్య 369 ఒకటి. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా 1991లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో థియేటర్లలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఇది ఒకటి. ఈ చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతారు. ఈ మూవీలో బాలకృష్ణ, మోహిని, సిల్క్ స్మిత, శుభలేఖ సుధాకర్, గొల్లపూడి మారుతిరావు, చంద్రమోహన్ వంటి ప్రముఖులు కీలకపాత్రలు పోషించగా.. హీరో తరుణ్ బాలనటుడిగా కనిపించారు. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఆదిత్య 369 సీక్వెల్ పై బాలకృష్ణ కీలకవ్యాఖ్యలు చేశారు. ఆయన హోస్టింగ్ చేస్తోన్న అన్ స్టాపబుల్ సీజన్ 4 కార్యక్రమంలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “ఆదిత్య 369కు సీక్వెల్ గా ఆదిత్య 999 రానుంది. మా అబ్బాయి మోక్షజ్ఞ తేజ హీరోగా యాక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది” అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 6న స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో ఆదిత్య 369 సినిమాకు సంబంధించిన గెటప్ లో కనిపించారు బాలయ్య. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. టైమ్ మిషన్, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఆదిత్య 369 చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు 110 రోజులు శ్రమించి ఈ సినిమాను పూర్తి చేశారు. అప్పట్లోనే ఈ చిత్రానికి రూ. కోటిన్నర వరకూ ఖర్చు అయినట్లు సమాచారం. 1991 జూలై 18న ఆదిత్య 369 విడుదలైంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే బాలకృష్ణ తన కొత్త సినిమా డాకు మహారాజ్ షూటింగ్ పనులు కంప్లీట్ చేశారు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.