Blood and Chocolate OTT: ఓటీటీలోకి వచ్చిన అర్జున్ దాస్‌ నయా మూవీ.. ‘బ్లడ్‌ అండ్‌ చాక్లెట్‌’ ఎక్కడ చూడచ్చంటే?

|

Sep 16, 2023 | 3:17 PM

గంభీరమైన గొంతుతో అతని నోటి నుంచి వచ్చే డైలాగులకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఖైదీ తర్వాత వచ్చిన మాస్టర్‌, విక్రమ్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్‌. ప్రస్తుతం తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. తెలుగులో 'బుట్టబొమ్మ' అనే సినిమాలో అర్జున్‌ దాస్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌- సుజిత్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ 'ఓజీ'లోనూ ఓ కీ రోల్‌ పోషిస్తున్నాడు.

Blood and Chocolate OTT: ఓటీటీలోకి వచ్చిన అర్జున్ దాస్‌ నయా మూవీ.. ‘బ్లడ్‌ అండ్‌ చాక్లెట్‌’ ఎక్కడ చూడచ్చంటే?
Blood And Chocolate Movie
Follow us on

స్టార్ డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్‌- హీరో కార్తీల కాంబినేషన్‌లో వచ్చిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతోనే మరొక నటుడు వెలుగులోకి వచ్చాడు. అతనే అర్జున్‌ దాస్‌. గంభీరమైన గొంతుతో అతని నోటి నుంచి వచ్చే డైలాగులకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఖైదీ తర్వాత వచ్చిన మాస్టర్‌, విక్రమ్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్‌. ప్రస్తుతం తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. తెలుగులో ‘బుట్టబొమ్మ’ అనే సినిమాలో అర్జున్‌ దాస్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌- సుజిత్‌ కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ‘ఓజీ’లోనూ ఓ కీ రోల్‌ పోషిస్తున్నాడు. కాగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌, అర్జున్‌ దాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన తమిళ సినిమా అనీతి. తెలుగులో బ్లడ్ చాక్లెట్‌గా వచ్చింది. షాపింగ్‌ మాల్‌, అరవన్‌, జైల్‌ సినిమాలతో ఫీల్‌గుడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వసంత్‌ బాలన్‌ ఈ మూవీని తెరకెక్కించారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో దుషారా విజయన్‌, వనితా విజయ్‌ కుమార్‌, భరణి తదితరులు నటించారు. జులై 21న థియేటర్లలో విడుదలైన బ్లడ్‌ అండ్‌ చాకొలెట్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే పెద్దగా ప్రమోషన్స్‌ లేకపోవడంతో ఓ మోస్తరు వసూళ్లను మాత్రమే దక్కించుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

సినిమా కథేంటంటే?.

బ్లడ్‌ అండ్‌ చాక్లెట్ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ ఫుడ్ డెలివ‌రీ బాయ్‌కి, ధ‌న‌వంతుల ఇంట్లో ప‌నిచేసే అమ్మాయికి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌ ఇది. మనుషుల్ని చంపాలనే ఆలోచనలతో కూడిన మానసిక సమస్యలతో బాధపడే యువకుడి పాత్రలో అర్జున్‌ దాస్‌ కనిపించాడు. మూవీలో అతని నటనకు మంచి పేరొచ్చింది. విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. ఎప్పటిలాగే వసంతబాలన్‌ తన డైరెక్షన్‌తో ఆకట్టుకున్నారు. స‌మాజంలో పేద‌, ధ‌నిక వ‌ర్గాల మ‌ధ్య ఉండే అంత‌రాల‌ను ఒక క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో చూపించారాయన. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

అర్జున్ దాస్ లేటెస్ట్ ఫొటోస్

బ్లడ్‌ అండ్‌ చాక్లెట్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..