OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి అనుపమ కొత్త సినిమా.. ఇంటిల్లిపాది నవ్వుకోండిక
దసరా కు థియేటర్లలో రిలీజైన సినిమాలు ఒక్కొక్కటి ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే రజనీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబాలి సినిమాల స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. తాజాగా అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన 'క్రేజీ కల్యాణం' సినిమా ఓటీటీ అప్డేట్ కూడా వచ్చేసింది.

1953925,1953923,1953893,1953874మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘క్రేజీ కల్యాణం’. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాగానే ఆడింది. ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. అయితే జైలర్ 2, రణబాలి వంటి స్టార్ హీరోల సినిమాలు పోటీగా ఉండడంతో ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తోనే సరి పెట్టుకుంది. దర్శకుడు బద్రప్ప గాజుల తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమతో పాటు నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్, కిరిటీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. యూరో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్మోహన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన క్రేజీ కల్యాణం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వెలువడింది. క్రేజీ కల్యాణం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అనుపమ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు. కమింగ్ సూన్ అంటూ క్రేజీ కల్యాణం పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేయనున్నారు. బహుశా ఈ శుక్రవారం ( నవంబర్ 13) నుంచి క్రేజీ కల్యాణం సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది.
క్రేజీ కల్యాణం సినిమా కథ విషయానికి వస్తే.. మెదక్ జిల్లాకు చెందిన పర్వతాలు(నరేష్)కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురికి పెళ్లి చేసి ఇంట్లోనే ఉంచుకుంటాడు. అల్లుడు బాలరాజు(తరుణ్ భాస్కర్) పెద్ద తాగుబోతు. నిత్యం ఊర్లో వారితో గొడవలు చేసి ఇంటి పరువు తీస్తుంటాడు. దీంతో తన చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్) కు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పోయిన తన పరువుని కాపాడుకోవాలనుకుంటాడు. కానీ కీర్తి తనతో పాటు కాలేజీ లో ఉదయ్(అఖిల్ రాజ్)ని ప్రేమిస్తుంది. సెటిలైపోయిన తర్వాత ఇంట్లో ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ ఇంతలోనే ఆమెకు తండ్రి ఒక అమెరికా సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? కూతురి ప్రేమ విషయం తెలిసిన తర్వాత పర్వతాలు ఏం చేశాడు? చివరకు కీర్తి పెళ్లి ఎవరితో జరిగింది? అనేది తెలియాలంటే ఈ క్రేజీ కల్యాణం సినిమా చూడాల్సిందే.
ఆహాలో అనుపమ క్రేజీ కల్యాణం
Consider this your invitation to madness! #CrazyKalyanam coming soon on aha!
@anupamahere #tharunbhascker @Akhilrajuddemar @IamChaitanyarao #CrazyKalyanamOnaha https://t.co/fE2M9yvBEX
— ahavideoin (@ahavideoIN) November 8, 2026
క్రేజీ కల్యాణం సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




